ఆంధ్రప్రదేశ్ కి జరుగుతున్నా అన్యాయానికి నిరసనగా విభజన హామీలు వెంటనే అమలు చేయాలని ఢిల్లీ లోని ఏపి్ భవన్ వేధిక గా నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టిడిపి అధినేత చంద్రబాబు ధర్మపోరాట దీక్ష చేశారు. తొలుత రాజ్ ఘాట్ లో మహాత్మగాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి దీక్ష ప్రారంభించారు. నిన్న ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు జరిగిన ఈ దీక్ష కి రాజకీయ ప్రముఖులు ఏఐసిరసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రివల్, కమల్ నాథ్, దేవగౌడ, డెరెక్ ఓ బ్రెయిన్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సంధర్భంగా నిన్న సాయంత్రం సభకి చేరుకున్న దేవగౌడ చంద్రబాబుతో కొద్ది సేపు మాట్లాడి ఆయనకి నిమ్మరసం అందించి ఆయన దీక్షని విరమింపజేశారు. కేంద్రం ఏపిద కి చేస్తున్న అన్యాయానికి క్షమాపనలు చెప్పి విభజన హామీలు, ప్రత్యేక ప్యాకేజ్ లను వెంటనే అమలు చేయాలని దానికి ఆంద్ర ప్రజల తరఫున చంద్రబాబు 3 రోజుల గడువుని ఇచ్చినట్టుగా తెలిపారు. దీనికి గాను నేడు సిఎం చంద్రబాబు సహ పలువురు నేతలు మంత్రులు ఢిల్లీ ఏపిు భవన్ నుండి మొదలుకొని రాష్టపతి భవన్ వరకు పాదయాత్ర చేయనున్నారు. పాదయాత్ర అనంతరం ఆయన రాష్ట్రపతి కొవింద్ కి వినితి పత్రం అందించి ఏపిద కి జరిగిన అన్యాయాలను కేంద్రం చూపెడుతున్న కక్షని గురించి ఆయన తో మాట్లాడనున్నారు.