‘లైంగిక వేధింపులు’ ఈ పదం ఈ మద్య చాలా కామన్ గా వినిపిస్తుంది. ఎటు చూసిన మహిళలు లైంగిక వేధింపులకు గురయ్యామంటూ ఆరోపణలు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఇలాంటి ‘లైంగిక వేధింపుల’ ఆరోపణలు బిగ్‌బాస్ ఇంట్లో కూడా జరిగాయంటు తెలిసింది. కన్నడ బిగ్‌బాస్ సీసన్ 6 పోటీలలో పాల్గొన్న కవితాగౌడ.. అనే పోటీదారు అదే ఇంట్లోని మరో సభ్యుడు యాండీ తనని లైంగికంగా హింసించిన్నట్లు మహిళ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.
పోటీలో పాల్గొన్న యాండీ నడుచుకున్న విధానం తనకు నచ్చలేదన్నారు. షోలో జరిగిన అహితరక ఘటనకు సంబంధించి తను పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వివరించినట్లు ఆమె తెలిపారు. తనకు జరిగిన అన్యాయానికి సంభందించి ప్రోగ్రాం ప్రోడ్యూసర్ గురుదాస్ శణైకి వివరించినట్లు ఆమె తెలిపారు. బిగ్‌బాస్ షో నుండి బయటకు వచ్చిన తరువాత ఫిర్యాదు చేస్తునట్లు తెలిపారు. రెండు రోజుల పాటు జరిగిన సూపర్ హీరో వర్సెస్ సూపర్ విలన్ టాస్క్‌లో యాండీ తనను లైంగికంగా హింసించిన్నట్లు ఆమె ఆరోపించారు.
బిగ్‌బాస్ పోటీల నుండి బయట వెళ్లిన తరువాత కవితగౌడ తనని కలవలేదని యాండీ తెలిపాడు. బిగ్‌బాస్ పోటీలలో కవితాగౌడ ఒటమిని తట్టుకోలేక తనపై లేనిపోని అరోపణలు చేస్తుందని ఆయన అన్నారు.