Advertisements

పవన్ సిద్ధాంతాలు నచ్చాయి.. కానీ..!

Google+ Pinterest LinkedIn Tumblr +

తాజాగా వచ్చిన ఫోటోలకి స్పందిస్తూ చాలా మంది జనం తనని జనసేన పార్టీలోకి ఎప్పుడు వెళ్లారు అని అడుగుతున్నారని అన్నారు బీవీ రాజు గ్రూపు కంపెనీల చైర్మన్ కేవీ విష్ణురాజు. తాను రాజకీయాల్లోకి రాను అని ముందే స్పష్టం చేశానని అదే మాటకు కట్టుబడి ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. తాను జనసేన పార్టీలో చేరినట్లు వస్తున్న వార్తలు సరికాదన్నారు.

కేవలం పవన్ సిద్ధాంతాలు నచ్చి అడ్వయిజరీ కమిటీలో సలహాలు ఇచ్చేందుకు అంగీకరించానని చెప్పుకొచ్చారు. విద్యా, ఉపాధి రంగాల్లో అభివృద్ధికి సహకరించేందుకే పార్టీ విధాన రూపకల్పన కమిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరిస్తానని పవన్ కళ్యాణ్ కు స్పష్టం చేసినట్లు తెలిపారు. తాను పవన్ కళ్యాణ్ ని కలిసినప్పుడు కూడా ఇవే అంశాలు చర్చించినట్లు తెలిపారు.

బీవీ రాజు గ్రూపు కంపెనీల ఛైర్మన్ గా కె.వి.విష్ణురాజు పనిచేస్తున్నారు. ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని కలిసిన ఆయన పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా విష్ణురాజును జనసేనలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నట్లు పవన్ తెలిపారు. అంతేకాదు రాబోయే తరానికి మంచి భవిష్యత్తును ఎలా ఇవ్వాలని ఆలోచిస్తున్న వారిలో విష్ణురాజు ఒకరని, భీమవరం వెళ్లినపుడు ఆయన కాలేజీలను నిర్వహిస్తున్న విధానాన్ని చూసి ఆశ్చర్యపోయానన్నారు. విధానాల రూపకల్పనలో రాజు ఆలోచనలు ఎంతగానో ఉపకరిస్తాయని భావిస్తున్నానని, ఆయనను కలవడం సంతోషంగా ఉందన్నారు.

Advertisements
Share.

Comments are closed.

%d bloggers like this: