భారత్‌తో కలిసి ముందడుగు వేస్తాం..పుతిన్

Google+ Pinterest LinkedIn Tumblr +

భారత్ పై ఉగ్రదాడి జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఇది వరకే అమెరికా ఎన్‌ఐ‌ఏ అధ్యక్షుడు డాన్ కొట్స్ హెచ్చరించారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని భారత్ ని ముందుగానే హెచ్చరించిన పరిస్తితి. సరిగ్గా ఆయన హెచ్చరించిన కొన్ని రోజులకే ఇలా జరగడం దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. నిన్న కాశ్మీర్ లోని పుల్వామాలో జరిగిన తీవ్రవాద ఆత్మాహుతి దాడి 44 మంది సైనికుల ప్రాణాల్ని పొట్టనబెట్టుకుంది. ఈ దాడికి సంభందించి పలువురు ప్రముఖులు వారివారి సంఘీభావాల్ని వ్యక్తపరచారు.

కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిని భారత్ చిరకాల మిత్రదేశమైన రష్యా తీవ్రంగా ఖండించింది. ఈ దాడిపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీకి తన ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తూ సందేశం పంపారు.

‘ జమ్మూకశ్మీర్‌లో భారత జవాన్లపై జరిగిన ఉగ్రదాడి దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దాడిలో జవాన్లు ప్రాణాలు కోల్పోవడం విచారకరం. ఈ క్రూరమైన చర్యను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ దాడి చేసినవారు, చేయించినవారు కచ్చితంగా ఫలితం అనుభవిస్తారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించే చర్యల్లో భారత్‌తో కలిసి మరింత ముందడుగు వేస్తామని మరోసారి చెబుతున్నా. ఈ కష్ట సమయంలో భారత్‌కు రష్యా అండగా ఉంటుంది. ఉగ్రదాడిలో గాయపడిన జవాన్లు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా’ అంటూ పుతిన్ సందేశం పంపారు.

Share.

Comments are closed.

%d bloggers like this: