ఢిల్లీ ఏపి భవన్ వేధికగా ఆంధ్రప్రదేశ్ కి జరుగుతున్న అన్యాయానికి నిరసనగా రాష్ట్ర విభజన హామీలని వెంటనే అమలు చేయాలని స్పెషల్ స్టేటస్ ను ఏపిర కి వెంటనే ఇవ్వాలనే డిమాండ్లతో ఏపి్ సిఎం చంద్రబాబు ధర్మపోరాట దీక్ష చేపట్టారు. దాదాపుగా 12 గంటల పాటు జరిగిన ఈ దీక్షకి దేశ రాజకీయ వేత్తలు మద్దత్తు ఇవ్వగా కొన్ని పార్టీలు మాత్రం ఇది కేవలం పోలిటికల్ స్టంట్ అంటూ కొట్టిపారేస్తున్నారు. చంద్రబాబు దీక్ష కేవలం ఎన్నికలకి ముందు సానుబూతి ఓట్లని ఆకర్షించడానికి మాత్రమే అని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కాదని రాజకీయ నేతలు అంటున్నారు.
ఈ నేపధ్యం లో మొన్న బిజేపి అధ్యక్షుడు అమిత్ షా ఈ దీక్ష పై సెటైర్లు, విమర్శలు చేయగా నిన్న టిఆర్ఎస్ ఎంఎల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ దీక్ష పై స్పందిస్తూ చంద్రబాబు పై విమర్శలు చేశారు. ఈ దీక్ష కేవలం ఓటర్ల సానుభూతి కోసమే అని ఆంధ్రప్రదేశ్ అభివృద్ది కోసం కాదని ఆయన అన్నారు. ఆయన ఆవేశం, బాధ కేవలం మొసలి కన్నీరు అని ఆయన ఆరోపించారు. ముందు స్పెషల్ ప్యాకేజ్ ఈ ముద్దు అన్న ఆయన ఇప్పుడు స్పెషల్ స్టేటస్ ఎందుకు కావాలంటున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికలు సమీపించడం తో ఓట్ల గురించి ఆయన ఈ దీక్ష చేశారని.. చంద్రబాబు కి ఆంధ్రప్రదేశ్ అభివృద్దే ముక్యమైతే ఆయన ఈ దీక్ష ఎప్పుడో మూడేళ్ళ క్రితమే చేసే వారని అలా చేసుంటే ఆయన దీక్ష ఫలించేదని ఆయన అన్నారు.