ఒకరి తరువాత ఒకరు క్యూలో రండి అనే పరిస్థితి వైసిపి అధినేత జగన్ కి వచ్చింది అనే చెప్పాలి. ఉదయం అవంతి శ్రీనివాస్ రావు అయితే సాయంత్రం కల్ల జై రమేష్ జగన్ సమక్షం లో వైసిపి పార్టీలో చేరబోతున్నారు. విజయ్ ఎలక్ట్రికల్స్ అధినేత దాసరి జై రమేష్ శుక్రవారం నాడు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. విజయవాడ పార్లమెంట్ స్థానం నుండి బలమైన అభ్యర్థి కోసం వైసీపీ ప్రయత్నాలు చేస్తున్న సమయం లో దాసరి జై రమేష్ వైసిపి లో చేరాలని ఆసక్తిని చూపారు.
దీంతో విజయవాడ పార్లమెంట్ స్థానం నుండి వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా దాసరి జై రమేష్ కు పోటీ చేసే అవకాశం ఉంది. విజయ్ ఎలక్ట్రికల్స్ అధినేత దాసరి జై రమేష్ శుక్రవారం నాడు హైద్రాబాద్‌లోని లోటస్ పాండ్‌లో సాయంత్రం నాలుగు గంటలకు జగన్‌ను కలవనున్నారు. జగన్ సమక్షంలో జై రమేష్ వైసీపీలో చేరిన వెంటనే విజయవాడ ఎంపీ సెగ్మెంట్‌కు ఆయనను ఇంచార్జీగా జగన్ ప్రకటించే అవకాశం ఉంది.