లక్ష్మీస్ ఎన్‌టి‌ఆర్ ట్రైలర్.. చాలా వైరల్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

నిన్న విడుదలయిన లక్ష్మీస్ ఎన్‌టి‌ఆర్ ట్రైలర్ సామాజిక మాధ్యమాల్లో చాలా వైరల్ అవుతుంది. ట్రైలర్ రెలిజ్ చేసీన ఒక్క గంట లోపే 10లక్షల వ్యూస్ తో హల్చల్ చేసింది. ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమా ’లక్ష్మీస్‌ ఎన్‌టిఆర్‘. లక్ష్మీ పార్వతి ఎన్‌టిఆర్ జీవితంలోకి ప్రవేశించిన తరువాత జరిగిన ఘటనల ఆధారంగా ఈ సినిమాను వర్మ తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమా ట్రైలర్‌ను గురువారం రిలీజ్‌ చేశారు. నమ్మితేనే కదా మోసం చేసేది అంటూ మొదలైన ట్రైలర్‌ ‘నా మొత్తం జీవితంలో చేసిన ఒకేఒక తప్పు వాడిని నమ్మడం’ అనడంతో ముగుస్తుంది. 1989 ఎన్నికల్లో ఎన్‌టిఆర్ ఓడిపోయిన తరువాత ఆయన జీవితంలో జరిగిన ఘటనలు, లక్ష్మీ పార్వతి ఎన్‌టిఆర్ జీవితంలోకి వచ్చిన వైనం, ఎలాంటి పరిస్థితుల్లో ఆమెను ఎన్‌టిఆర్ వివాహం చేసుకున్నారనే విషయాలను ట్రైలర్‌లో చూపించారు.

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఎన్‌టిఆర్ బయోపిక్‌లో చూపించని ఎన్నో నిజాలు లక్ష్మీస్‌ ఎన్‌టిఆర్ లో ఉంటాయని రామ్‌ గోపాల్‌ వర్మ ఇప్పటికే ప్రకటించారు. జివి ఫిలిమ్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు కల్యాణ్ మాలిక్‌ సంగీతమందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: