ఎన్నికల నడుమ మహర్షి..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

సూపర్ స్టార్ మహేష్ బాబు 25 వ సినిమా మహర్షి పై ఎన్నికల ప్రభావం పడనుందా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ నటిస్తోన్న ఈ సినిమాను దిల్ రాజు, పీవీపి, అశ్వనీదత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహేశ్ సరసన పూజ హెగ్డే కథానాయిక గా కనపడనుండి. ధనవంతుడైన ఓ వ్యారవేత్త ఓ పల్లెకు రావడం, మహర్షిలా మారటం అనే స్టోరీ లైన్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ముందుగా ఈ సినిమాను ఏప్రిల్ 5న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఏప్రిల్ 25న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు అదే సినిమాకు ఇబ్బందిగా మారబోతుంది. ఎందుకంటే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ త్వరలోనే రాబోతుంది. ఏపీలో ఏప్రిల్ 20 నుండి 30 మధ్యలో లేదంటే ఏప్రిల్ 20 నుండి మే ఫస్ట్ వీక్ మధ్యలో ఎన్నికల హడావిడి ఉంటుందని అంటున్నారు. కీలకప్రచారం ఏప్రిల్ ఆఖరి వారంలో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఎన్నికల సమయంలో సినిమాలపై ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపరు. పైగా ఈసారి ఏపీ ఎన్నికలు రసవత్తరంగా సాగున్నాయి. కాబట్టి అందరి దృష్టి ఎలక్షన్స్ పైనే ఉంటుంది. మరి అదే రోజుల సినిమా విడుదల చేసి రిస్క్ తీసుకుంటారా..? లేక డేట్ మారుస్తారా..? అనేది చూడాలి!

Share.

Comments are closed.

%d bloggers like this: