నేటితో కే‌సి‌ఆర్ 66..! హ్యాపీ బర్త్ డే కే‌సి‌ఆర్..

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేకర్ రావు 66 వ పుట్టిన రోజు..

తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస పార్టీ అధినేత, ఉధ్యమకారుడు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనుడు.. తెలంగాణ సాధనకి తన ప్రాణం సైతం పణంగా పెట్టి ఆమరణ నిరాహార దీక్ష చేసిన వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ముఖ్యమంత్రి మాత్రమే కాదు ప్రజా నాయకుడిగా గుర్తింపు తెచ్చుకొని దేశ వ్యాప్తం గా తనకి ఒక గుర్తింపుని ఉనికిని సంపాదించిన వ్యక్తి కే‌సి‌ఆర్..

నేడు(17 ఫిబ్రవరి) ఆయన 66 సంవత్సరాలకి చేరుకున్నాడు. రాష్ట్ర విభజన జరిగి కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ గడ్డకి తనదైన రీతిలో అభివృద్ది అనే లక్ష్యం తో పని చేస్తున్నారు కే‌సి‌ఆర్. ఈ క్రమంలో రాష్ట్రం ఏర్పడ్డ తరువాత జరిగిన రెండ ఎన్నికల్లో వరుస విజయాలు బారి మెజారిటీ తో గెలుపొందారు కే‌సి‌ఆర్. తన నాయకత్వం పై తన పథకాలపై పక్క రాష్ట్రాలే కాకుండ దేశ వ్యాప్తంగా రాజకీయ నాయకుల ప్రశంసలు పొందారు. తాను చేపట్టిన పథకాలు రైతు బంధు, 24 గంటల కరెంట్, షీ టీమ్స్ వంటి పథకాలను ఆధార్శంగా తీసుకొని పలు రాష్ట్రాలలో మరోపక్క కేంద్రం కూడా ఈ పథకాలని అమలు లోకి తీసుకొస్తున్నాయి. కే‌సి‌ఆర్ పథకాలు అధర్శమని బేష్ అని ప్రశంసలు వస్తున్నాయి. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలతో చెరువులని, గుంటలనీ పర్యావరణాన్ని కాపాడుతున్నారు. 3 కోట్ల మొక్కలు నాటినట్టు అధికారికంగా ప్రకటనలు చేశారు. ఇలాంటి మరిన్ని పథకాలతో, కార్యాలతో మరింత అభివృద్దితో మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని కోరుకుంటూ..!

Share.

Comments are closed.

%d bloggers like this: