జమ్ము కాశ్మీర్‌లోని పుల్వామా తీవ్రవాద దాడి కారణంగా 44 మంది జవాన్లు అమరులు కావడంతో.. దేశం లోని ప్రతి ఒక్కరూ ప్రతీకార వాంఛతో రగిలిపోతున్నారు. ప్రతి ఒక్కరికికి కడుపు మరిగిపోతుంది. ప్రధాని మోది కూడా భారత ఆర్మీకి పూర్తి స్వేచ్చ ని ప్రకటించాడు. ఇలా మరిగిపోతున్నాడు మన దేశానికి చెందిన ఒక వెబ్ హ్యాకర్ అతడే అన్షుల్ సక్సేనా.
అన్షుల్ సక్సేనా. ఇప్పుడు ఈయన పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎందుకంటే అతను పాకిస్తాన్ పైన తనకు తెలిసిన విద్య ద్వారా ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నాలు చేశాడు. ఇందులో భాగంగా పాకిస్తాన్‌కు చెందిన పలు వెబ్ సైట్లను హ్యాక్ చేశాడు. అధికారికంగా 3 గవర్నమెంట్ వెబ్ సైట్లని ఈయన హ్యాక్ చేశాడు. ఇదే క్రమంలో మరిన్ని సిట్లని హ్యాక్ చేయడానికి సిద్ధమవుతున్నాడు.
ఈ సందర్భంగా అన్షుల్ సక్సేనా ట్వీట్ చేస్తూ… సీఆర్పీఎప్ జవాన్లపై తీవ్రవాదుల దాడి నేపథ్యంలో టెర్రరిస్టులపై సోషల్ మీడియా ద్వారా సానుభూతి చూపుతున్న వారి ట్వీట్స్, ఫేస్బుక్ పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ తనకు పంపించాలని, తన ఈ మెయిల్‌కు పంపించాలని సూచించాడు. వాటిని కూడా హ్యాక్ చేసేందుకు సిద్ధమయ్యాడు.