Advertisements

భారత్‌ మాతాకీ జై..! లండన్ నగరం దద్ధరిల్లింది..!

Google+ Pinterest LinkedIn Tumblr +

జమ్ముకశ్మీర్‌ పుల్వామా లోని ఉగ్రవాద దాడి మన దేశన్నే కాకుండ ప్రపంచ దేశాలన్నిటిని కలచివేసింది. 44 మంది సి‌ఆర్‌పి‌ఎఫ్ జవాన్ లను బలి తీసుకున్న ఈ ఘటన పై అన్నీ రాష్ట్రాల మంత్రులు సంఘీభావం, సానుబుతి తెలియజేశారు. యువత శాంతియుత ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ ఘటన ని ప్రస్తావిస్తూ అనేక దేశాల మంత్రులు.. ప్రధానులు వారి సంఘీభావాన్ని వ్యక్తం చేశారు.

ఈ నేపధ్యం లో లండన్‌ నగరం లో నివశిస్తున్న భారతీయుల నిరసనలతో లండన్ నగరం దద్ధరిల్లింది. జమ్ముకశ్మీర్‌ పుల్వామా ఉగ్రవాద దాడిపై బ్రిటన్‌ లో ఉన్న భారతీయులు పాక్‌ హైకమీషనర్‌ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. పాకిస్థాన్‌ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. భారత్‌ మాతాకీ జై…అమరులకు జోహార్లు అంటూ భారతీయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాకిస్థాన్‌ ను టెర్రరిస్ట్‌ దేశంగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

Advertisements
Share.

Comments are closed.

%d bloggers like this: