గేల్ గుడ్ బై..! ప్రపంచకప్ ఆటలే చివరివి..!

Google+ Pinterest LinkedIn Tumblr +

వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ టీ-20 ఆటలకి ప్రసిద్ధుడు సుప్రసిద్ధుడు క్రిస్‌ గేల్‌ అన్నీ వర్గాల అటు పిల్లలు ఇటు పెద్దలు అందరూ ఇష్టపడే ఆటగాడు.. కేవలం వెస్టిండిస్ లోనే కాకుండా ఇతని విధ్వంశకర బ్యాట్టింగ్ శైలికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అయితే ఈరోజు అతను అభిమానులకి ఒక చేదు వార్తని ప్రకటించాడు. ఈ ఏడాది జరుగనున్న వన్డే ప్రపంచ కప్ ఆటల తర్వాత వన్డేలకు వీడ్కోలు పలకనున్నట్లు ప్రకటించాడు. మేలో ఇంగ్లాండ్ వేధికగా ఆరంభమయ్యే ఈ వరల్డ్‌కప్ టోర్నీ వన్డేలే అతడికి చివరి టోర్నీలు. వరల్డ్‌కప్ అనంతరం తాను వన్డేల నుంచి తప్పుకోవాలని గేల్ నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు వెస్టిండిస్ క్రికెట్ బోర్డు ట్విట్టర్‌లో అధికారిక ప్రకటన చేసింది.

39 ఏళ్ల గేల్‌ 1999 సెప్టెంబరులో భారత్‌పై టొరంటో వేధికగా జరిగిన వన్డే ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. వన్డే ఫార్మాట్‌లో బ్రియాన్‌ లారా (10,405) తర్వాత అత్యధిక పరుగులు చేసిన వెస్టిండిస్ బ్యాట్స్‌మన్‌ క్రిస్ గేలే కావడం విశేషం. అంతేకాకుండా వన్డేల్లో డబుల్‌ సెంచరీ సాధించిన (2015 వరల్డ్‌కప్‌లో జింబాబ్వేపై) ఏకైక వెస్టిండీస్‌ క్రికెటర్‌ కూడా ఇతడే.. గేల్ ఆటలు వన్డే లో మిస్ అయిన టీ-20 లో మాత్రం కొనసాగుతుంది. ఐపిడ‌ఎల్, బిగ్-బ్యాష్ లో మాత్రం గేల్ గాలి వీస్తూనే ఉండాలి..!

Share.

Comments are closed.

%d bloggers like this: