తెలంగాణ కేబినెట్ విస్తరణ ఇవాళ ఉదయం 11.30 గంటలకు జరగనుంది. రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేసే మంత్రుల జాబితాను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. మొత్తం 10 మందికి మంత్రి వర్గంలో చోటు కల్పించారు. ఈసారి మంత్రివర్గంలో చోటు దక్కిన వాళ్ళకు ముఖ్యమంత్రి కేసీఆర్ తానే స్వయంగా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ ఖరారు చేసిన జాబితాలో అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఈటల రాజేందర్, వి. శ్రీనివాస్‌గౌడ్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, చేమకూర మల్లారెడ్డిలు ఉన్నారు.
2014 లో కొత్త రాష్ట్రంగా అవతరించిన తెలంగాణాలో 2018 లో మొదటిసారి అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 2014 లో సమైక్య రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి. ఆ తరవాత తొలిసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీఆర్ఎస్, అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రిత్వ నేతృత్వంలో జూన్ 2 ను తెలంగాణా అపాయింటెడ్ డే గా ప్రకటించింది. 2018 ఎన్నికల్లో కూడా విజయ దుందుభి మోగించి, రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేసీఆర్ డిసెంబర్ 13, 2018 న తాను ముఖ్యమంత్రిగా, మహమూద్ అలీ హోంమంత్రిగా గవర్నర్ సమక్షంలో రాజ్ భవన్లో ప్రమాణ స్వీకారం చేశారు.
1. నిరంజన్ రెడ్డి – వనపర్తి
#ఆర్థిక శాఖ
మొదటి నుంచి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. గత ప్రభుత్వంలో ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ గా పని చేశారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినా మొదటి నుంచి పార్టీలో ఉన్నాడు.
2. ప్రశాంత్ రెడ్డి – బాల్కొండ
#పరిశ్రమలు
2001 లో రాజకీయాల్లోకి వచ్చారు. మొదటి నుంచి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. 2014 లో మొదటి సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత ప్రభుత్వంలో మిషన్ భగీరథ వైస్ చైర్మన్ గా పని చేశారు.
3. కొప్పుల ఈశ్వర్ – ధర్మపురి
#విద్యాశాఖ
వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మొదటి నుంచి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. గత ప్రభుత్వంలో ప్రభుత్వ చీఫ్ విప్ గా పని చేశారు.
4. ఎరబెల్లి దయాకర్ రావు – పాలకుర్తి
#వ్యవసాయం
వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మొదటి మూడు టర్మ్ లు వర్ధన్న పేట నుంచి, రెండోసారి మూడు టర్మ్ లు పాలకుర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది డబల్ హ్యాట్రిక్ సాధించారు. 2014 లో టీడీపీ నుంచి గెలుపొంది, తరవాత టీఆర్ఎస్ లో చేరారు. ప్రస్తుతం మొదటిసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
5. జగదీశ్వర్ రెడ్డి – సూర్యాపేట
#రోడ్లు భవనాలు శాఖ
మొదటి నుంచి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. 2014 లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత ప్రభుత్వంలో విద్యుత్, షెడ్యూల్ క్యాస్ట్ అభివృద్ది శాఖల మంత్రిగా పని చేశారు.
6. తలసాని శ్రీనివాస్ యాదవ్ – సనత్ నగర్
#పౌర సరఫరాల శాఖ
వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మూడుసార్లు మంత్రిగా పని చేశారు. సమైక్య రాష్ట్రంలో కూడా మంత్రిగా చేశారు. గత ప్రభుత్వంలో సినిమాటోగ్రఫీ మంత్రిగా పని చేశారు.
7. అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి – నిర్మల్
#వైద్య ఆరోగ్య శాఖ
గతంలో రెండుసార్లు ఎంపీగా, 4 సార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. 2014 లో బీఎస్పీ నుంచి ఎన్నికై పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేశారు. గత ప్రభుత్వంలో దేవాదాయ, న్యాయ శాఖ మంత్రిగా పని చేశారు.
8. చేమకూర మల్లారెడ్డి – మేడ్చల్
#విద్యుత్ శాఖ
2014 లో మల్కాజ్ గిరి ఎంపీగా టీడీపీ నుంచి గెలుపొందారు. ఆ తరవాత టీఆర్ఎస్ కు వచ్చారు. ఈసారి మొదటిసారి మేడ్చల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
9. శ్రీనివాస్ గౌడ్ – మహబూబ్ నగర్
#మునిసిపల్, ఎక్సైజ్ శాఖ
2014 లో మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గతంలో ఉద్యోగ సంఘం నాయకునిగా పని చేశారు. ప్రస్తుతం మొదటిసారి మంత్రిగా నేడు ప్రమాణం చేయబోతున్నారు.
10. ఈటల రాజేందర్ – హుజూరాబాద్
#వెల్ఫేర్
వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ముందు నుంచే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. గతంలో టీఆర్ఎస్ ఎల్పీ నేతగా పనిచేశారు. 2014 ప్రభుత్వంలో ఆర్థిక, పౌర సరఫరాల శాఖల మంత్రిగా పనిచేశారు.
లోక్ సభ ఎన్నికల తరవాత మిగిలిన 6 ఖాళీల భర్తీకి అవకాశం