అగ్రనేతల భేటీ..

Google+ Pinterest LinkedIn Tumblr +

కేంద్రం పై అటు ప్రజలలో మరియు రాజకీయ వర్గాలలో వ్యతిరేకత పెరిగిపోతుంది. నిర్లక్ష్య పాలన, నిరంకుశ పాలన అంటూ ముఖ్యమంత్రులు సైతం మండిపడుతున్నారు. ధర్మపోరాటం అంటూ డిల్లీ వేధికగా చంద్రబాబు చేశారు, కోల్కతా లో 3 రోజులపాటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా దీక్ష చేశారు.. ఇలా మరెన్ని రాబోతున్నాయో అనే ప్రశ్న ప్రజల్లో మోదలవుతుంది. ఇలా ఏ ఒక్కరూ దీక్ష చేసినా.. నిరసన చేసినా అందరూ ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మద్దత్తు తెలుపుతున్నారు. బి‌జే‌పి ని గద్ధే దింపాలని నిశ్చయించుకున్నారు.

ఈ క్రమం లో మొన్న టి‌ఎం‌సి అధినేత మమతా బెనర్జీ కోల్కతా లో భారి ఎత్తున ర్యాలి ని నిర్వహించారు దీనికి మద్దతు తెలుపుతూ చాలా మంది అగ్రనేతలు ఈ ర్యాలి లో పాల్గొన్నారు. మమతా నిర్వహించిన ర్యాలీ శైలిలో అమరావతి వేధికగా స్పెషల్ స్టేటస్ కోరుతూ చంద్రబాబు కూడా ర్యాలి నిర్వహించే దిశలో ఉన్నారు.

దీనికి గాను చంద్రబాబుకి మొత్తం 22 ముఖ్యమంత్రులు.. మంత్రుల అవసరం ఉంది . ఈ సంధర్భంగా చంద్రబాబు అప్పటికే ముఖ్యమంత్రులతో సన్నాహాలు జరుపుతున్నట్లు సమాచారం. నిన్న దేశ రాజధాని డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ఆంధ్రప్రదేశ్ కి పయనమయ్యారు. ఎయిర్పోర్ట్ లో నీటి వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా ఆయనకి స్వాగతం పలికారు. అనంతరం కేజ్రివల్ చంద్రబాబు నివాసం చేరుకున్నారు. ఇరువురు రానున్న ఎన్నికల గురించి కాసేపు భేటీ అయ్యారు.. ఈ భేటీ లో భాగంగా చంద్రబాబు నిగ్ర్వహిస్తున్న ర్యాలీ గురించి కూడా సంభోదన వచ్చినట్టు సమాచారం.

Share.

Comments are closed.

%d bloggers like this: