బంధువులతో నిండాల్సిన బరాత్ శేవాలతో నిండింది..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఒక పక్క పెళ్లి సందడి మరో పక్క విషాదం. ఒక పక్క పెళ్లి కూతురు మరో పక్క మృత్యువాతన పడ్డ బంధువులు.. డోలు మ్రోగుతుంది విషాదం అధిగమించింది.. బంధువుల తో నిండాల్సిన బరాత్ శేవాలతో నిండింది. రాజస్తాన్ లో ఈ విషాదం జరిగింది. అప్పుడే పెళ్లి పూర్తయ్యి అత్తగారింటికి వెళ్తున్నా పెళ్లి కూతురి బరాత్ పైకి లారీ ధూసుకొచ్చింది విషాదం చిగురించింది.

రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్ జైపూర్ హైవే లో అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది.. పెళ్లి బరాత్ జరుపుతున్న వారిపైకి ఓ ట్రక్ దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో 13 మంది చనిపోయారు. మరో 18 మందికి గాయాలయ్యాయి. వివాహానికి హాజరైన వారు బరాత్‌లో పాల్గొన్నారు. బ్యాండ్, బాజాలతో బరాత్ ఫుల్ జోష్‌గా సాగుతోంది. అయితే, ఉన్నట్టుండి వారిపైకి లారీ దూసుకొచ్చేసింది.

డ్రైవర్ కంట్రోల్ చేయలేకపోవడం వల్ల లారీ అదుపుతప్పి పెళ్లి బృందం మీదకు దూసుకెళ్లినట్టు భావిస్తున్నారు. ట్రక్ ఢీకొనడంతో 9 మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. వీరు కాకుండా మరో 18 మందికి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం ఉదయ్‌పూర్‌లోని ఆస్పత్రికి తరలించారు. వారిలో పెళ్లికూతురు కూడా ఉండడం గమనార్హం.

Share.

Comments are closed.

%d bloggers like this: