118 కథలో తారక్ కనిపించాడు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆటల్లోనూ, సినిమాల్లోనూ అన్నదమ్ముల్ని కలిసి ఒకే తాటి పై చూస్తే అభిమానులకి మరింతా ఉత్సాహంగా అనిపిస్తుంది. సినిమాల్లో ఆటల్లో ఇప్పటికీ వరకు మనం ఇలాంటి కొన్ని కాంబినేషన్స్ చుశాము. అయితే జై లవకుశ సినిమా వచ్చిన తరువాత సినిమా ఆడియో ఫంక్షన్ లో సక్సెస్ మీట్ లో ఇద్దరు అన్నదమ్ముల్ని ఒకే స్టేజ్ పై చూసినప్పట్నుంచి నందమూరి అభిమానుల్లో ఓ కోరిక మొదలయ్యింది. టాలీవుడ్ బ్రదర్స్ కళ్యాణ్ రామ్ – జూనియర్ ఎన్టీఆర్ కలయికలో ఒక సినిమా వస్తే బావుంటుందని నందమూరి అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు.

అసలు మ్యాటర్ లోకి వస్తే.. నెక్స్ట్ తారక్ తో కళ్యాణ్ రామ్ మరో సినిమాను నిర్మిస్తాడట. ఇక రీసెంట్ గా 118కథను విన్న కళ్యాణ్ రామ్ మొదట తన ఉహల్లోకి కథానాయకుడిగా తారక్ కనిపించినట్లు చెప్పాడు. కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ ఈ సినిమా తమ్ముడు చేస్తే బావుంటుందని అనుకున్నా కానీ నిర్మాత మహేష్ కోనేరు వచ్చి.. ఈ సినిమా మీతో తియ్యాలని అనుకుంటున్నాం అనగానే కాదనలేకపోయా అని తెలిపారు.

ఎన్టీఆర్ ఆర్ట్స్ లో కళ్యాణ్ రామ్ నిర్మించిన జై లవకుశ సినిమా మంచి విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఇక వీలైనంత త్వరగా తారక్ తో మరో సినిమా ఉంటుందని కళ్యాణ్ రామ్ తెలిపారు. ప్రస్తుతం రాజమౌళి “ఆర్‌ఆర్‌ఆర్” తో బిజీగా ఉన్నారు తారక్.

Share.

Comments are closed.

%d bloggers like this: