అన్నిటికీ సిద్ధమే.. హెచ్చరిస్తున్నా..!

Google+ Pinterest LinkedIn Tumblr +

జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో సి‌ఆర్‌పి‌ఎఫ్ జవాన్ల కాన్వాయ్‌పై జరిగిన ఆత్మాహుతి దాడితో దేశమంతా ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 40మంది జవాన్లు అమరులయ్యారు. ఈ ఘటనకు పాల్పడింది తామేనని జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఈ దాడితో దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు రగిలాయి. ప్రతీకార వాంఛ తో దేశ ప్రజలంతా కసిగా ఉన్నారు. దీనికి పక్క దేశం పాకిస్థానే కారణమంటూ ప్రజలంతా ఆందోళనలు చేస్తున్నారు. ఈ దాడి వెనుక పాకిస్థాన్ హస్తం ఉందని ప్రజలు భావిస్తున్నారు. ఇంటెలిజెన్స్ కూడా పాకిస్తాన్ హస్తం ఉందని భావిస్తుంది.

వస్తున్న వార్తలపై పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని భారత్ తమపై తప్పుడు ప్రచారం చేస్తుందని ఆయాన మండిపడ్డారు. అవన్నీ కేవలం పుకార్లే అని ఆయన కొట్టిపారేశారు ఉగ్రవాదానికి పాకిస్థాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతివ్వదని, తాము కూడా ఉగ్రవాద బాధితులేమంటూ.. పాకిస్థాన్ కూడా ఉగ్రదాడులతో సతమతమవుతోందన్న సంగతి ప్రపంచం గుర్తించాలంటూ మొసలి కన్నీరు కార్చారు. అలా కాదని తమపై దాడికి దిగితే ధీటైన సమాధానం చెప్పేందుకు పాక్ ఆర్మీ కూడా సిద్ధంగానే ఉందని హెచ్చరికలు జారీచేశారు.

Share.

Comments are closed.

%d bloggers like this: