కొత్త పాత్రలో విజయ్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో అర్జున్ రెడ్డి ఫేమ్.. విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో బిజీ గా ఉంటున్నారు. కథలో కాస్త కొత్తదనం కొత్త పాత్ర ఉంటే చాలు ఆ డైరెక్టర్ కి ఓకే చెప్పేస్తున్నారు.. వరుస విజయాలతో మంచి ఊపుమీద ఉన్న విజయ్ ఇప్పుడు దర్శకుడు క్రాంతి మాధవ్ రూపొందిస్తోన్న సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా మొదటి షెడ్యూల్ ని పూర్తయ్యింది.

చాలా సంవత్సరాలతారువత బొగ్గు కార్మికుడి పాత్రలో మన తెలుగు హీరో కనపడబోతున్నాడు. ఇది వరకు బాలకృష్ణ ఈ పాత్ర చేయగా ఇప్పుడు మళ్ళీ విజయ్ చేస్తున్నాడు.. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సింగరేణిలో పని చేసే ఉద్యోగిగా కనిపించనున్నాడు. కార్మికులకు యూనియర్ లీడర్ గా విజయ్ పెర్ఫార్మన్స్ ఓ రేంజ్ లో ఉంటుందని చెబుతున్నారు.

అయితే కథ ప్రకారం సినిమాలో విజయ్ కి ఎనిమిదేళ్ల కొడుకు కూడా ఉంటాడని సమాచారం. అంటే విజయ్ తండ్రి పాత్రలో కనిపిస్తాడన్నమాట. ప్రేమకథా నేపధ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో రాశిఖన్నా, ఐశ్వర్యారాజేష్, క్యాతరిన్ వంటి హీరోయిన్లు కనిపించనున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: