నేరస్థులతో కలవడం మంచిది కాదు.. బాబు!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఎన్నికలు సమీపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం నిప్పెస్తే బగ్గుమనేల రాజుకుంటుంది. హటాత్తుగా ఏం అయ్యిందో ఏమో.. ఉన్నట్టుండి నేతలు పార్టీలు మారుతున్నారు. టి‌డి‌పి పార్టీ వారు వై‌సి‌పి లోకి వై‌సి‌పి వారు ఇతర పార్టీల్లోకి.. జగన్ కే‌సి‌ఆర్ పట్టాన చెరీ హైదరాబాద్ లోటస్ పాండ్ లో రాజకీయ సన్నాహాలు చేస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. వరుసగా వలసలో నేతలు పార్టీలు మారుతున్నారు. జగన్ ది అయితే క్యూ కట్టి రండి అనే పరిస్థితి.

ఇది ఇలా ఉంటే నిన్న సాయంత్రం నటుడు అక్కినేని నాగార్జున జగన్ ను లోటస్ పాండ్ లో కలిసి కాసేపు సమావేశం అయ్యారు. ఈయనే సమావేశం ఎమో కానీ దీని పై పలు వార్తలు వచ్చాయి సోషల్ మీడియా లో పుకార్లు చెక్కర్లు కొట్టాయి. అందరి అటెన్షన్ నాగార్జున వైపే.. ఆయన ఆ పార్టీ లోకి చేరబోతున్నారని రాబోయే ఎన్నికల్లో ఆంధ్ర నుండి పోటీ చేయబోతునట్టుగా వార్తలొచ్చాయి. దీనికి స్పందిస్తూ నాగార్జున ‘జగన్ మా కుటుంబ సన్నిహితుడు.. అందుకే ఆయనను మర్యాదపూర్వకంగానే కలిశానన్నారు. పాదయాత్ర విజయవంతంగా పూర్తి చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపానన్నారు. ఎవరికో టికెట్ విషయంలో నేను జగన్‌ను సంప్రదించలేదన్నారు నాగర్జున.

అయితే ఈ భేటీపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. సినీ పరిశ్రమ వారు.. నేరస్థులతో కలవడం మంచిది కాదన్నారు. జగన్, నాగార్జున భేటీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే అనేకమంది ఎమ్మెల్యేలు… ఎంపీలు.. టీడీపీని వీడి వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జగన్‌తో నాగార్జున భేటీ అవ్వడం పట్ల కూడా సీఎం సీరియస్ అయ్యారు. అలాంటి నేరస్థులతో … సినిపరిశ్రమకు చెందిన వారు కలవడం అంత మంచిది కాదని హితవు పలికారు.

Share.

Comments are closed.

%d bloggers like this: