ఎన్నికలు సమీపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం నిప్పెస్తే బగ్గుమనేల రాజుకుంటుంది. హటాత్తుగా ఏం అయ్యిందో ఏమో.. ఉన్నట్టుండి నేతలంతా పార్టీలు మారుతున్నారు. టిడిపి పార్టీ వారు వైసిపి లోకి వైసిపి వారు ఇతర పార్టీల్లోకి.. జగన్ కేసిఆర్ పట్టాన చెరీ హైదరాబాద్ లోటస్ పాండ్ లో రాజకీయ సన్నాహాలు చేస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. వరుసగా వలసలో నేతలు పార్టీలు మారుతున్నారు. జగన్ ది అయితే క్యూ కట్టి రండి అనే పరిస్థితి.
ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాస్, అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబులు జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్ దక్కదనే ఉద్దేశంతోనే వీరంతా పార్టీ మారుతున్నారని టీడీపీ వర్గాలు విమర్శిస్తున్నాయి.
అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు వైసీపీలో చేరగానే అక్కడ అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. మాజీ ఎంపీ, దివంగత లోక్‌సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి కుమారుడు హరీశ్‌ను తెలుగుదేశం పార్టీ రంగంలోకి దింపింది. ఈ కారణంతో పండుల రవీంద్రబాబు వైసీపీలో చేరినట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
అమలాపురం టికెట్‌ను బాలయోగి కుటుంబానికి ఇవ్వడానికి చంద్రబాబు సముఖంగా ఉన్నట్టు తెలియడంతోపాటు హరీశ్‌ను అధిష్ఠానం ప్రమోట్ చేస్తూ, దివంగత నేత బాలయోగి కుటుంబం పట్ల అమలాపురం నియోజకవర్గంలో సానుకూలత ఉన్నందున ఆయన తనయుడిని రంగంలోకి దింపితే విజయం పక్కా అని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే ఎంపీగా ఉన్న తనను పక్కన పెట్టడంపై రవీంద్రబాబు మనస్తాపంతో ఉన్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. ఇక వైసీపీలో చేరిన రవీంద్రకు గన్నవరం లేదా రాజోలు అసెంబ్లీ సీటును జగన్ ఖరారు చేసినట్టు తెలుస్తోంది.