మహేశ్ కి జీఎస్టీ షాక్…!

Google+ Pinterest LinkedIn Tumblr +

అత్యాధునిక టెక్నాలజీ తో సరికొత్త శైలితో గచ్చిబౌలిలో ప్రారంభించిన సినిమాస్ మల్టిఫ్లెక్స్ కి జీఎస్టీ అధికారులు షాక్ ఇచ్చారు. ఇలా కొన్ని రోజుల నుంచి అధికారులు మహేశ్ బాబు కి షాక్ లు ఇస్తూనే ఉన్నారు. కొన్ని రోజుల క్రితం మహేష్ బాబుకు టాక్స్ విషయంలో జీఎస్టీ అధికారులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ ఘటన జరిగిన కొద్ది రోజుల్లోనే జీఎస్టీ అధికారులు ఏఎంబి సినిమాస్ కు నోటీసులు జారీ చేశారు. నిబంధనల్ని అతిక్రమించిన నేపథ్యంలో ఏఎంబి సినిమాస్ కు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం సినిమా టికెట్స్ విషయంలో 28 శాతంగా ఉన్న జిఎస్టీని 18 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. కొత్త రేట్లు జనవరి 1 నుంచి అమలయ్యాయి. కానీ ఏఎంబి సినిమాస్ మాత్రం పాత నిబంధనలతోనే ప్రేక్షకులకు అధిక ధరకు టికెట్ విక్రయిస్తున్నట్లు తెలిసిందే. దీనితో విచారణకోసం జీఎస్టీ అధికారులు రంగంలోకి దిగారు. రంగారెడ్డి జిల్లా జీఎస్టీ కమిషనరేట్ యాంటీ ప్రాఫిటీరింగ్ అధికారులు ఏఎంబి సినిమాస్ కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇందులో ఏషియన్ గ్రూప్ కూడా భాగస్వామిగా ఉంది.

Share.

Comments are closed.

%d bloggers like this: