ఆస్తి సొంత అన్నదమ్ములని విడదీస్తుంది..! తండ్రి కొడుకులని వేరు చేస్తుంది.. బార్య భర్తల మధ్య విభేదాలు తెస్తుంది.. కుటుంభ కలహాలకి దారి తీస్తుంది. సొంత మనుషులు అని కూడా చూడకుండా హత్యలు చేసే స్థితికి కి మనిషి ని దిగజారుస్తుంది. ఇలాంటి ఓ సంఘటనే విజయవాడ లో చోటుచేసుకుంది. బార్య బర్తల మద్య ఆస్తి తగాదాలు తలెత్తి అవి కాస్త పెద్దవయ్యి దాదాపుగా తన భర్త ప్రాణం తీసే స్థితికి దిగజారిన్దూ మహిళ..!
ఆస్తి కోసం కట్టుకున్న భర్తపై ఓ మహిళ వేడివేడి మసిలే నీటిని పోసింది. ఈ సంఘటన విజయవాడలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే… విజయవాడ అయోధ్యనగర్ కి చెందిన అట్టూరి వెంకట రమణ(49) హైదరాబాద్ లో భవన నిర్మాణ పనులు చేస్తుంటాడు. వెంకట రమణకు 18ఏళ్ల క్రితం హేమలతతో వివాహమైంది. హేమలత.. నగరపాలక సంస్థ పాఠశాలలో హిందీ టీచర్ గా పనిచేస్తోంది. వీరికి ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. గత కొంతకాలంగా భార్య, భర్తల మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి.
భర్తపేరిట ఉన్న ఆస్తిని.. తన పేరిట, పిల్లల పేరిట రాయాల్సిందిగా హేమలత కొంతకాలంగా వెంకట రమణను వేధించడం మొదలుపెట్టింది. అతను నిరాకరించడంతో.. భర్తపై వేడి వేడీ మసిలే నీటిని పోసేసింది. దీంతో.. అతనికి తీవ్రగాయాలు అయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.