ఉగ్రనిర్మూలన లో భారత్ కి తోడుంటాం..!

Google+ Pinterest LinkedIn Tumblr +

జమ్ముకాశ్మీర్‌ పుల్వామాన ప్రాంతంలో మృత్యు దేవత సంచరించిన విషయం తెలిసిందే. రోజురోజుకి మృతుల సంఖ్య పెరిగిపోతుంది. ఎంత రక్తం చూసినా ఎన్ని ప్రాణాలు బలి తీసుకున్నా ఆ ప్రాంతాన్ని వదలట్లేదు. మొన్న జరిగిన ఉగ్రదాడిలో 44 మంది భారత జవాన్లు ప్రాణం కోల్పోయారు. ప్రతీకార వాంఛతో భారత ప్రజలు రగిలిపోతున్నారు. ఈ ఘటన కి స్పందిస్తూ.. అనేక దేశాలు భారత్ పై సానుబూతి తెలియజేస్తూ ఉగ్ర నిర్మూలనలో భారత్ కి తోడుంటామని వ్యక్యానించారు. ఈ సంధర్భంగా సౌదీ యువరాజు మొహ్మద్ బిన్ సల్మాన్‌ భారత పర్యటనలో భాగంగా ఆయన కూడా పుల్వామ ఘటన పై స్పందిస్తూ తన మద్దత్తు ని తెలియజేశారు.

సౌదీ యువరాజు మొహ్మద్ బిన్ సల్మాన్‌కు ఢిల్లీలో ఘన స్వాగతం లభించింది. బుధవారం రాష్ట్రపతి భవన్‌లో త్రివిధ దళాల నుంచి సౌదీ యువరాజు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ప్రధానితో కలిసి ఆయన సంయుక్తంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ తనకు పెద్దన్నయ్య అని, తామిద్దరం అన్నదమ్ములమని అన్నారు. మోదీ నుంచి తాను ఎంతో స్ఫూర్తిని పొందుతానని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా పుల్వామా ఉగ్రదాడిని ప్రస్తావించిన సౌదీ యువరాజు, ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌, సౌదీ అరేబియాది ఒకే విధానమని అన్నారు. ఈ విషయంలో నిఘా సమాచారంతోపాటు భారత్‌‌కు పూర్తిగా సహకరిస్తామని మొహ్మద్ బిన్ స్పష్టం చేశారు. తీవ్రవాదాన్ని అంతం చేయడానికి రాజకీయంగా భారత్‌కు తమ సహాయసహకారాలు ఉంటాయని తెలిపారు.

గత 70 ఏళ్లుగా సౌదీ అరేబియా నిర్మాణంలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని, వందల ఏళ్లుగా ఎంతో మంది సౌదీ ప్రజలు భారత్‌లో పని చేస్తూ, భారత్ అభివృద్ధిలో భాగస్వాములయ్యారని కితాబిచ్చారు. తీవ్రవాదంపై పోరాటంలో సౌదీతో కలిసి పనిచేస్తామని, యువరాజు బిన్ సల్మాన్ వ్యాఖ్యలను మోదీ స్వాగతించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: