ఒక్క కాన్పు.. ఏడు శిశువులు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

గర్భం దాలిస్తేనే ఆడపిల్ల జన్మ సంపూర్ణం అవుతుంది అంటారు పెద్దలు. సాధారణంగా అలా గర్భం దాలిస్తే మహిళలకి ఒకరు లేదా కవలలు పుడతారు. కడుపులో ఒక బిడ్డ కాకుండా, ఇద్దరుంటేనే కష్టం. అలాంటిది ఓ మహిళ ఏకంగా ఏడుగురు శిశువులకి జన్మనిచ్చింది.

ప్రసవం అంటే మహిళకు మరో జన్మ ఎత్తినట్లే. మాములుగా ప్రసవంలో ఒకరు లేదా ఇద్దరు, అంతకుమించి అంటి ముగ్గరు ఉంటారు. అప్పుడు డెలీవరీ కూడా ఎంతో కష్టం కానీ, ఇరాక్‌లోని ఓ మహిళ ఒకే కాన్పులో ఏకంగా ఏడుగురు పిల్లలకు జన్మనిచ్చింది. వీరంతా ఇప్పుడు ఎంతో ఆరోగ్యంగా కూడా ఉన్నారు.

ఇరాక్‌లోని దియాలీ ప్రావిన్స్‌లోని ఓ ఆస్పత్రిలో ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. మహిళ వయసు 25. పుట్టిన ఏడుగురు పిల్లల్లో ఆరుగురు అమ్మాయిలుండగా, ఓ అబ్బాయి కూడా ఉన్నాడు. ఇప్పటికే మహిళకు ముగ్గురు పిల్లలుండగా.. పుట్టిన పిల్లలతో మొత్తం 10మంది అయ్యారు.

Share.

Comments are closed.

%d bloggers like this: