జయరాం కేసు ఆగెనా..? ఇంకా సాగేనా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రముఖ వ్యాపారవేత్త జయరాం హత్య కేసు అందరి ఆసక్తి మలుపుకుంటుంది. ఈ కేసు లో వలస కొద్ది ట్విస్ట్ లు బయటపడుతున్నాయి.. మేన కోడలు శ్రీఖా చౌదరి తో మొదలై.. అలా అలా ఆంధ్ర తెలంగాణ పోలీసుల వరకు పాకింది. ‘’ఒక జంట.. ఇద్దరు రౌడీ షీటర్లు.. ముగ్గురు పోలీసులు.. నటులుగా’’ ఉన్న ఈ కేసుకి ప్రమోషన్ వచ్చింది అయితే అది 3 పోలీసుల నుంచి 5 గురు పోలీసులకి చేరింది. నేడు ఏసిు‌పి కార్యలయం లో జరిగిన విచారణలో ఇబ్రహీంపట్నం ఏసీపీ మరిన్ని ట్విస్ట్లని బయటకి తెచ్చాడు.
ఆదిభట్లలోని ఓ భూ వివాదం కేసులో తన సహాయం కోసం రాకేష్ రెడ్డి వచ్చినట్టుగా గతంలో ఇబ్రహీంపట్నం ఏసీపీగా పనిచేసిన మల్లారెడ్డి విచారణ అధికారులకు చెప్పినట్టు సమాచారం. బుధవారం నాడు జయరామ్ హత్య కేసును విచారిస్తున్న బంజారాహిల్స్ ఏసీపీ కార్యాలయం ఎదుట మాజీ నల్లకుంట సీఐ, మాజీ ఇబ్రహీంపట్నం ఏసీపీలు హాజరయ్యారు.

జయరామ్ హత్య కేసుకు సంబంధించి ఇద్దరు పోలీసు అధికారులను బంజారాహిల్స్ ఏసీపీ కార్యాలయంలో విచారించారు.ఆదిభట్లలోని ఓ భూ వివాదం విషయంలో రాకేష్ రెడ్డితో తనకు పరిచయం ఏర్పడిందని మల్లారెడ్డి విచారణాధికారులకు వివరించినట్టు సమాచారం.జయరామ్ హత్య జరిగిన మరునాడు ఆదిభట్ల భూ వివాదం కేసు విషయమై తాను రాకేష్ రెడ్డికి ఫోన్ చేసినట్టుగా మల్లారెడ్డి విచారణ అధికారికి చెప్పినట్టు సమాచారం.తాను రాకేష్ రెడ్డికి ఫోన్ చేసిన సమయానికి జయరామ్ హత్య కేసులో రాకేష్ రెడ్డి పారిపోయిన విషయం తనకు తెలియదని ఆయన వివరించినట్టుగా తెలుస్తోంది.

ఈ మేరకు కాల్ రికార్డ్స్‌ కూడ ఉన్నాయని ఏపీ పోలీసులు చెప్పారు. అయితే కాల్ రికార్డ్స్ బయటపడడంతో విచారణకు హాజరైన ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసుల నుండి విచారణాధికారులు ఏం రాబడుతారోననేది సర్వత్రా ఆసక్తిగా మారింది.

Share.

Comments are closed.

%d bloggers like this: