మీది నిజంగానే ఓ దేశమేనా?..ఎడ్యుకేట్ చేయండి..!

Google+ Pinterest LinkedIn Tumblr +

జమ్ము కాశ్మీర్ పుల్వామ ఉగ్రదాడులని ఖండిస్తూ దేశ వ్యాప్తంగా నిరసనల జ్వాలలు రేగుతున్నాయి. ఎవ్వరూ సహించలేనటువంటి ఈ దాడులకి దేశ వ్యాప్తం గా ప్రతీ ఒక్కరూ ప్రతీకార వాంఛ తో ఉన్నారు. ఆ దాడికి కౌంటర్ దాడులని ఆశిస్తున్నారు. సాధారణ ప్రజలు సెలబ్రిటీలు అందరూ నిరసనలు చేపడుతున్నారు. ఈ నేపధ్యం లో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన ట్విటర్ ఖాతా ద్వారా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ని ఉద్దేశిస్తూ విమర్శలు గుప్పిచ్చారు. మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకుందామంటూ పాక్ ప్రధాని అన్న వ్యాఖ్యలపై రామ్ గోపాల్ వర్మ స్పందించారు.

మాటలతో అన్ని సమస్యలు పరిష్కరించుకోవచ్చని మీరు భావించినప్పుడు.. మూడు పెళ్లిళ్లు చేసుకోవాల్సిన అవసరం ఎలా వచ్చిందంటూ సెటైర్ వేశారు. రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ ని రచయిత కోన వెంకట్ తెలుగులోకి అనువదించడం విశేషం.ఇక మరో ట్వీట్ లో వర్మ.. ‘‘ ఒక వ్యక్తి టన్నుల కొద్ది ఆర్డీఎక్స్ తో మా వైపు పరిగెత్తుకొస్తున్నప్పుడు అతనితో ఎలా చర్చలు జరపాలో మా మూగ భారతీయులకు కొంచెం చెప్పండి. ఊరికే ఏమీ వద్దు. భారతీయులందరం మీకు మీ ట్యూషన్ టీచర్ కు ఫీజు చెల్లిస్తాం. మీ దేశంలో ఎవరు(ఒసామా బిన్ లాడెన్) నివసిస్తున్నారనేది అమెరికాకు తెలుస్తుంది. కానీ మీ దేశంలో ఎవరు నివసిస్తున్నారనేది మీకు తెలియదు. అసలు మీది నిజంగానే ఓ దేశమేనా? ఓ మూగ భారతీయుడ్ని అడుగుతున్నాను. దయచేసి నన్ను కొంచెం ఎడ్యుకేట్ చేయండి సర్.’’ అంటూ ట్వీట్ చేశారు.

‘‘ఉగ్రవాద సంస్థలు జైషే మహ్మద్, లష్కరే తోయిబా, తాలిబన్, ఆల్ ఖైదా మీ ప్లేస్టేషన్లు అని నాకు ఎవరూ చెప్పలేదు, కానీ మీరు కూడా వాటిపై ప్రేమ లేదనే విషయాన్ని ఎప్పుడూ అంగీకరించలేదు. జైషే మహ్మద్, లష్కరే తోయిబా, తాలిబన్, ఆల్ ఖైదాలను మీరు బంతులుగా భావించి, పాకిస్తాన్ బౌండరీలు దాటిస్తూ భారత పెవిలియన్ లోకి కొడుతున్నారు. కానీ మీరు వాటిని క్రికెట్ బాల్స్ అనుకుంటున్నారా లేక బాంబులు అనుకుంటున్నారో కాస్త చెప్పాలి. దయచేసి మాకు తెలివితేటలు నేర్పండి సర్’’ అంటూ ఆర్జీవీ వ్యంగాస్త్రాలు విసిరారు.

Share.

Comments are closed.

%d bloggers like this: