బాబు భయపడుతున్నాడు-వర్మ..!

Google+ Pinterest LinkedIn Tumblr +

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్’ చిత్రం విడుదలకు ముందే తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా ఈ సినిమాపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన టెలీ కాన్ఫరెన్స్ లో పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్‌ చరిత్రను వక్రీకరించేలా కొందరు కుట్రలు పన్నుతున్నారని, కుట్రదారుల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించారు.

ఆ వెంటనే స్పందించిన వర్మ, ఓ వీడియో టీజర్ తో కౌంటర్ ఇచ్చారు. ‘మహానాయకుడు’ చిత్రంలోని రానా (చంద్రబాబు పాత్రధారి) కనిపించే వీడియోను పోస్ట్ చేస్తూ, “లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ మీద వచ్చే రకరకాల రియాక్షన్స్‌కు మీ నుండి వచ్చే రియాక్షన్‌ ఏంటి సార్‌?” అని జర్నలిస్ట్ ప్రశ్నించినట్టుగా, “దానికి సమాధానంగా మీరేమన్నా సరే రియాక్ట్ కావొద్దు, ఏమన్నా సరే” అంటున్న రానాను చూపించారు. ఈ వీడియో సన్నివేశం ‘మహానాయకుడు’ థియేటరికల్ ట్రయిలర్ లోనిదే కావడం గమనార్హం. ఇక దీనికి క్యాప్షన్ గా “లక్ష్మీస్ ఎన్టీఆర్ పై చంద్రబాబు భయం ఇలా ఉంది” అని రాశారు.

Share.

Comments are closed.

%d bloggers like this: