హనుమాన్ భక్తుడిగా మారిన నితిన్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ యాక్ట‌ర్ నితిన్ తాజాగా ఆంజనేయస్వామి భక్తుడిగా మారిపోయాడు. కాషాయం వస్త్రాలు, ఆంజనేయస్వామి మాల ధరించిన ఉన్న ఫోటోని తన ట్విట్ట‌ర్‌ ద్వారా ట్వీట్ చేశాడు. దీక్ష వ‌ల‌న తాను చాలా శాంతంగా ఉన్న‌ట్టు పేర్కొన్నాడు. ఉద‌యాన్నే 5 గంటలకి లేచిన త‌న‌కి శ్రీ ఆంజ‌నేయం సాంగ్స్‌ తో డే స్టార్ట్ అవుతుంద‌ని అన్నాడు. ఆ త‌ర్వాత పూజా కార్య‌క్ర‌మాలతో బిజీ కానున్న‌ట్టు స్ప‌ష్టం చేశాడు. ఆధ్యాత్మిక‌త‌తో కూడిన వైబ్స్ తనకు స‌రికొత్త ఉత్సాహం ఇస్తుంద‌ని నితిన్ త‌న ట్వీట్‌లో తెలిపాడు. ఇప్పుడు ఆ ట్వీట్‌ కాస్తా వైరల్ గా మారింది..

సినిమాల విష‌యానికి వ‌స్తే.. త్వరలో భీష్మ చిత్రంతో నటించబోతున్నాడు నితిన్. ఛలో ఫేమ్ వెంకీ కుడుముల ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రంలో నితిన్ సరసన క్రేజీ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. గత ఏడాది నితిన్ నటించిన ఛల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం చిత్రాలు నిరాశ పరిచాయి. కాగా, భీష్మ చిత్రంతో తిరిగి పుంజుకోవాలని నితిన్ భావిస్తున్నాడు.

Share.

Comments are closed.

%d bloggers like this: