బహిస్కరిస్తే.. 100కోట్ల నష్టపరిహారం..!

Google+ Pinterest LinkedIn Tumblr +

పుల్వామా ఉగ్రదాడి పై ఆటగాళ్లు సైతం నిరసనలు వ్యక్తపరుస్తున్నారు. అమరవీరులకి సంఘీభావం తెలుపుతూ ప్రాపంచ కప్ లో భాగంగా జూన్ 16న జరగబోయే భారత్ పాక్ ఆటను భారత జట్టు బహిష్కరించాలని కోరుతున్నారు. బి‌సి‌సి‌ఐ ని విన్నపిస్తున్నారు. మాజీ ఆటగాళ్లు ఈ ఘటనని ప్రస్తావిస్తూ ఒక్కొక్కరుగా పాక్ పై విమర్శలు చేస్తున్నారు పాక్ తో ఆటలని బాయ్కాట్ చేయాలని బదులిస్తున్నారు..

ఈ క్రమంలో మాజీ ఆటగాళ్లు హర్బజన్ సింగ్, గౌతమ్ గంభీర్ లు ఇప్పటికే ఆటను బహిష్కరించాలని కోరగా తాజాగా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పుల్వామ దాడిని ప్రస్తావిస్తూ పాక్ తో జారగాల్సిన ఆటలని బహిష్కరించాలని కోరాడు. కేవలం క్రికెట్ లోనే కాకుండా హాకీ, ఫుట్ బాల్ ల లోనూ బహిష్కరించాలని ఆయన కోరారు.

ఒకవేళ వీరు కోరినట్టే ఆ మ్యాచ్‌ను కనుక బహిష్కరిస్తే.. అప్పుడు పాక్ విజేతగా నిలిచి రెండు పాయింట్లు చేజిక్కించుకుంటుంది. దీంతో.. తాము ఇప్పట్లో ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని కేంద్ర ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చెప్పుకొస్తోంది. పాక్‌తో మ్యాచ్‌ను భారత్ ఆడకపోతే పాయింట్లతో పాటు.. కనీసం రూ.100కోట్లుపైనే బ్రాడ్‌కాస్టర్స్‌కి నష్టపరిహారం చెల్లించాల్సి రావొచ్చు.

Share.

Comments are closed.

%d bloggers like this: