గూగుల్.. వేయి కోట్లతో నిర్మాణం..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఐ‌టీ రంగం లో దూసుకుపోతున్న హైదరబాద్ లో ఇప్పుడు మరో గూగుల్ కంపెనీ సిద్ధం కాబోతోంది..! ఇప్పటికే హైదరాబాద్ లో ఒక గూగుల్ కంపెనీ గచ్చిబౌలి లో ఉన్న విషయం తెలిసిందే.. అయితే ఒకే గూగుల్ కంపెనీ నుండి ఇది రెండవ భవన్ కావడం గమనార్హం.
ఇప్ప‌టికే ఎన్నో పేరుగాంచిన అంత‌ర్జాతీయ కార్పొరేట్ సంస్థ‌ల‌కు హైద‌రాబాద్ న‌గ‌రం నిలయంగా ఉంది. అయితే ప్ర‌ముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ గూగుల్ అతిపెద్ద కార్యాలయం త్వ‌ర‌లో ఏర్పాటు కానుంది. నాన‌క్‌రాంగూడ ఫైనాన్షియ‌ల్ డిస్ట్రిక్ట్‌లో ఈ సంస్థ నిర్మాణం కానుంది. అమెరికా బ‌య‌ట గూగుల్ నిర్మించ‌నున్న అతి పెద్ద కార్యాలయం ఇదే కావ‌డం విశేషం. ఇప్ప‌టికే ఈ కార్యాల‌య నిర్మాణానికి గాను అవ‌స‌ర‌మైన అనుమ‌తుల కోసం గూగుల్ ప్ర‌య‌త్నిస్తున్న‌ది. దీంతో త్వ‌ర‌లో ఫైనాన్షియ‌ల్ డిస్ట్రిక్ట్‌లో గూగుల్ మ‌రో క్యాంప‌స్ ఏర్పాటు కానుంది.

హైద‌రాబాద్‌లో గూగుల్ కు ఇప్ప‌టికే కొండాపూర్ లో ఓ కార్యాల‌యం ఉంది. అందులో 7వేల మంది ఉద్యోగులు ప‌నిచేస్తున్నారు. కాగా ఇప్పుడు నాన‌క్‌రాంగూడలో నిర్మించ‌నున్న క్యాంప‌స్ గూగుల్‌కు హైద‌రాబాద్‌లో రెండోది. ఈ నిర్మాణానికి 2015లోనే అంకురార్ప‌ణ జ‌రిగింది. అప్ప‌ట్లో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ అమెరికాకు వెళ్లిన‌ప్పుడు గూగుల్ తో తెలంగాణ ప్ర‌భుత్వం ఒప్పందం చేసుకుంది. అందులో భాగంగానే న‌గ‌రంలో గూగుల్ క్యాంప‌స్‌ను నిర్మించేందుకు 7.2 ఎక‌రాల స్థ‌లాన్ని కేటాయించారు. ఈ క్ర‌మంలో గూగుల్ ఇప్పుడు ఆ స్థలంలోనే త‌న భారీ క్యాంప‌స్‌ను నిర్మించ‌నున్న‌ది.

నాన‌క్‌రాంగూడ ఫైనాన్షియ‌ల్ డిస్ట్రిక్ట్‌లో గూగుల్ నిర్మించ‌నున్న క్యాంప‌స్ లో 13వేల మంది ఉద్యోగులు ప‌నిచేయ‌నున్నారు. మొత్తం 22 ఫ్లోర్ల‌తో భ‌వ‌నాన్ని ఒకే బ్లాక్‌గా నిర్మించ‌నున్నారు. రూ.1వేయి కోట్ల‌తో ఈ క్యాంప‌స్‌ను నిర్మించ‌నున్నారు. అందులో మూడు బేస్‌మెంట్లు, గ్రౌండ్ ఫ్లోర్ తోపాటు మొత్తం 22 అంత‌స్తులు ఉంటాయి. బేస్‌మెంట్ల‌ను పార్కింగ్ కోసం వినియోగించ‌నున్నారు. అలాగే భ‌వనానికి పూర్తిగా సోలార్ విద్యుత్ వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. ఈ క్ర‌మంలో మొత్తం కార్యాల‌యానికి 300 కిలోవాట్ల విద్యుత్ అవ‌స‌రం ఉంద‌ని తేల్చారు.

Share.

Comments are closed.

%d bloggers like this: