ఒక మడత.. ఆరు కెమెరాలు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం శాంసంగ్‌ ఎప్పటినుంచూ ఆపిల్ సంస్థతో పోటీ పడుతున్న విషయం తెలిసిందే. శాంసంగ్‌ సంస్థ ఏదైనా కొత్తగా విడుదల చేసిందంటే చాలు వెంటనే ఆపిల్ సంస్థ పోటీకి ఎదో ఒకటి విడుదల చేసేస్తుంది. అయితే ఈ పోటీలో ఎవరో ఒకరు ఎదో ఒక కొత్త రకమైన గ్యాడ్జెట్ రిలీజ్ చేస్తూనే ఉంటారు.

దక్షిణకొరియా ఎలక్ట్రానిక్‌ దిగ్గజం శాంసంగ్‌ భిన్నంగా ఆలోచించి ఎట్టకేలకు ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. 5జీ సపోర్టుతో శాంసంగ్‌ ఫోల్డ్‌ను తీసుకొచ్చింది. అలాగే గెలాక్సీ ఎస్ ఫోన్లను మార్కెట్‌లోకి తీసుకువచ్చి పదేళ్లు అయిన సందర్భంగా గెలాక్సీ ఎస్10 సిరీస్‌‌ను ఆవిష్కరించింది.

గెలాక్సీ ఫోల్డ్ ఫీచర్లు

గెలాక్సీ ఎస్10 సిరీస్‌లో కంపెనీ నుంచి వచ్చిన తొలి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ఇది. ఈ ఫోన్‌ను మడతపెట్టినప్పుడు 4.6 అంగుళాల స్క్రీన్, ఓపెన్ చేసినప్పుడు 7.3 అంగుళాల స్క్రీన్ ఉంటుంది. ఒకేసారి మూడు యాప్స్‌ను మల్టీటాస్కింగ్ చేయవచ్చు. స్క్రీన్స్ స్విచింగ్‌లో యాప్‌ ఎక్కడ ఆగిందో మళ్లీ అక్కడి నుంచే ప్రారంభమౌతుంది. అంటే రెండు ఫోన్ల పనిని ఇది చేస్తుంది. మొత్తం ఆరు కెమెరాలను ఈ స్మార్ట్‌ఫోన్‌లో అమర్చింది .

7 ఎన్ఎం ప్రాసెసర్
12 జీబీ ర్యామ్, 512 జీబీ మెమరీ
16+8+12 ఎంపీ ఔట్‌ సైడ్‌ ట్రిపుల్‌ కెమెరా
10+8+10 ఎంపీ ఇన్‌సైడ్‌ ట్రిపుల్‌ కెమెరా
4380 ఎంఏహెచ్ బ్యాటరీ
ప్రారంభ ధర దాదాపు రూ.1,40,000.

Share.

Comments are closed.

%d bloggers like this: