పట్టణాల కంటే గిరిజన ప్రాంతాలని మెరుగ్గా చేస్తా..!

Google+ Pinterest LinkedIn Tumblr +

రాజమండ్రి నుంచి రంపచోడవరం వరకు బస్సులో వెళ్లిన జనసేనాని పవన్ కళ్యాణ్ రంపచోడవరంలో బహిరంగసభను నిర్వహించారు. రంపచోడవరంలో ఆయన పలు కులాల సంక్షేమం గురించి ప్రాంతాల గురించి మహిళల గురించి యువత గురించి మాట్లాడారు ఆయన మాట్లాడుతూ..

ప్రభుత్వం ఏర్పాటు చేస్తే గర్భిణీ స్త్రీల విషయంలో ప్రత్యేక శ్రద్ద జనసేన తీసుకుంటుంది అదే వేరే ఏ పార్టీ అయిన గర్భిణిల గురించి ఆలోచించిందా..? ఉద్యోగావకాశాలు కల్పిస్తే గిరిజన యువత ఎందుకు పెడత్రోవ పడుతుంది ఎందుకు పక్కదారి తీసుకుంటారు, ఎందుకు గంజాయికి మధ్యానికి బానిసలవుతారు. గంజాయిసాగు బలవంతంగా నిలువరించడం కాదు యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తే వారే నిలకడగా ఉంటారు బాధ్యతగా వ్యవహృస్తారు. ఏ యువకుడు కూడా గంజాయిసాగుకు వెళ్లలేనంత పరిస్థితి కలిగిస్తాను…

30 ఎకరాలు సింగపూర్ లో తీసుకుంటే 10వేలు ఉద్యోగాలిస్తారు.. పదివేలు ఎకరాలు తీసుకున్న దుర్మార్గులు ఉద్యోగ కల్పన ఎందుకు చేయడంలేదు. ప్రజలు ముఖ్యమంత్రికి వెదవల్లా కనిపిస్తున్నారా..? ఎన్నికలు ముందు నిరుద్యోగ బృతి ఇస్తే నాలుగేళ్లనుంచి ఇచ్చేస్తున్నట్టా. రంపచోడవరంలో నేను మాటిస్తున్నా.. అవినీతి రహిత పాలనను తీసుకొస్తాను. ఆటల్లో అత్యుత్తమ క్రీడాకారులను గిరిజనులనుంచి తీసుకొచ్చే బాధ్యతను నేను తీసుకుంటా. వైద్యం , విద్య గిరిజన ప్రాంతాల్లో బలంగా ఉండాలి.. వ్యవస్థను పటిష్టం చేసుకునేదిగా ఉండాలి ఆ బాద్యత నాది. ఏజెన్సీలో చక్కటి విద్యావ్యవస్థను కల్పిస్తాము పట్టణ ప్రాంతాల్లో కంటే గిరిజన ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తాము.. అని ఆయన స్పీచ్ అదరగొట్టారు.

Share.

Comments are closed.

%d bloggers like this: