పావలా కోసం లండన్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఎన్నికలు దేగ్గరపడుతున్నాయి ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకి రాజకీయం హీటెక్కుతుంది. ఇలాంటి పరిస్తుతుల్లో నాయకులందరూ రాష్ట్రంలోనీ ఉంటూ ప్రచారాలు సభలు అంటూ బిజీగా ఉండాలి. కానీ వై‌సి‌పి అదినేత జగన్ మాత్రం దీనికి బిన్నంగా చేసి లండన్ టూర్ అంటూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సెటైర్ వేశారు. ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికలు దగ్గర పెట్టుకుని ఏ నాయకుడు విదేశీ పర్యటనలకు వెళ్లరని ఎద్దేవా చేశారు. కేవలం డబ్బుల కోసమే జగన్ లండన్ పర్యటనకు వెళ్తున్నారని ఆరోపించారు. హవాలా డబ్బుల కోసమే ప్రతిపక్షనేత విదేశీ పర్యటనలకు వెళ్తున్నారంటూ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. విభజన హామీలపై జగన్ బీజేపీ ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. ఇక పుల్వామా దాడి విషయంలో మోడీపై చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు ముఖ్యమంత్రి. నరేంద్రమోడీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు చేసిన కామెంట్లను గుర్తు చేశామన్నారు.

ఎన్నికల వేళ వైసీపీ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు గత కొన్ని రోజులుగా పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. వైసీపీపై ఘాటు విమర్శలు విరుచుకుపడుతున్నారు. అభ్యర్థుల ఎంపిక, కసరత్తుతో పాటు మేనిఫెస్టో రూపకల్పన వంటి కీలక సమయంలో జగన్ లండన్ పర్యటనకు వెళ్లడంపై ముఖ్యమంత్రి అనుమానాలు వ్యక్తం చేశారు.

Share.

Comments are closed.

%d bloggers like this: