గత కొంతకాలంగా చాలా మంది యాక్టర్లు లైంగికంగా హింసకి గురవుతున్నారని మెడియ ముందు వాపోతున్న విషయం తెలిసిందే. దీనినే మీటూ ముమెంట్ అని ఇదో హాట్ టాపిక్ గా మారిన విశయం అందరికీ తెలుసు. బాలీవుడ్ లో మొదలైన ఈ మీటూ ముమెంట్ ఇప్పుడూ అన్నీ రాష్ట్రాల్లోకి విస్తృతంగా పాకుతుంది.
సినిమా ఇండస్ట్రీలో లైంగిక ఆరోపణలు రోజురోజుకి ఎక్కువవుతున్నాయి. చాలా మంది నటీమణులు తాము ఎదుర్కొన్న వేధింపులను మీడియా ముఖంగా వెల్లడించారు. తాజాగా మరోనటి తను ఎదుర్కొన్న చేదు అనుభవాలను మీడియా ముందు బయటపెట్టింది.
లైంగిక వేధింపుల కారణంగా ఆమె నటనకు దూరమవుతున్నాననిచెప్పడం అందరినీ షాక్ కి గురి చేసింది. మలయాళీ నటి కణి కుసృతి ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది. ‘కాక్ టెయిల్’, ‘షికార్’ వంటి చిత్రాల్లో తన నటనతో జనాలను మెప్పించింది. తమిళంలో కూడా కొన్ని చిత్రాల్లో నటించింది. మంచి నటిగా రాణిస్తున్న సమయంలో సడెన్ గా నటనకి దూరమైంది. దానికి కారణం ఏంటని ఇటీవల ఆమెని ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా.. షాకింగ్ నిజాలు వెల్లడించింది. ఓ చిత్ర దర్శకనిర్మాతలు తమను శారీరకంగా సుఖపెడితేనే సినిమాలో ఆఫర్ ఇస్తామని అడిగారట. కానీ దానికి కణి కుసృతి అంగీకరించకపోవడంతో ఆమెకు అవకాశాలు రాలేదని ఆమె చెప్పుకొచ్చారు. అంతటిటూ ఆగకుండా తన తల్లి పై కూడా ఒత్తిడి తీసుకొచ్చారని ఆమె వాపోయారు.