పల్లె ప్రగతికి పంచాయతీ ప్రధాన పాత్ర-కేసీఆర్

Google+ Pinterest LinkedIn Tumblr +

పల్లెల అభివృద్ధి కొరకు కేసీఆర్ కొత్తగా విధుల విషయం లో మార్పులు చేశారు. పది సూత్రాలు పాటించమని ఆదేశించారు. పల్లెల అభివృద్ధి లో పంచాయితీ ప్రధాన పాత్ర పోషించాలని లేకపోతే వేటు తప్పదని ఆయన సెలువిచ్చారు. పంచాయతీ కార్యదర్శికి 30 రకాల విధుల్ని సూచించారు.

పల్లెలు ప్రగతి సాధించేందుకు సర్కారు పది సూత్రాలు పక్కాగా అమలు చేయనున్నది. అధికారాలు, విధులు, నిధుల వినియోగం పకడ్బందీగా జరిగేలా చట్టంలో రాష్ట్ర ప్రభుత్వం పొందుపర్చింది. గ్రామసభ నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే వేటు పడనున్నది. అంతేకాకుండా పంచాయతీ కార్యదర్శికి కీలకమైన 30 రకాల విధుల్ని అప్పగించింది. ఇప్పుడు గెలిచిన పాలకవర్గం ఇప్పుడీ చట్టాన్నే అమలు చేయాల్సి ఉంటుంది.

పంచాయతీల్లో సర్పంచులుగా గెలిచిన అభ్యర్థులు కొత్త పంచాయతీ రాజ్ చట్టం-2018 ప్రకారం పని చేయాల్సి ఉంటుంది. అధికారాలు, విధులు, నిధుల వినియోగానికి సంబంధించిన చెక్‌పవర్, పంచాయతీల్లో గ్రామ సభల నిర్వహణ, సామాజిక బాధ్యతగా చేయాల్సిన పనులు ఇలా అనేక విషయాలను పంచాయతీరాజ్ చట్టంలో పొందుపరిచారు.

ప్రజలకు నేరుగా సేవలు అందించడంలో పంచాయతీ ప్రధాన పాత్ర పోషిస్తున్నది. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్నది. నూతన పంచాయతీ రాజ్ చట్టంలో సర్పంచ్‌కి విధులతో పాటు గతంలో లేని విధంగా తప్పనిసరిగా పాటించాల్సిన విధులున్నాయి. ప్రధానంగా సర్పంచ్, ఉప సర్పంచ్‌కి చెక్ పవర్ కల్పించారు. ఇదిలావుండగా గ్రామ సభలను సరిగ్గా నిర్వహించకపోతే సర్పంచ్‌ని పదవీ నుంచి తొలిగించేలా చట్టంలో నిబంధనలు పొందుపర్చారు.

Share.

Comments are closed.

%d bloggers like this: