గ్లాసు దాహం తీరుస్తది.. పీక కూడా కోస్తది..!

Google+ Pinterest LinkedIn Tumblr +

కొంతకాలంగా నాగబాబు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నారు. తన ఇంటర్నెట్ ఖాతాల ద్వారా జగన్ చంద్రబాబు బాలకృష్ణలని టార్గెట్ చేస్తూ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. ఎపిసోడ్ల మాదిరిగా వీడియోలు పెడుతున్నారు, తన ఇంటెర్వ్యులలో ఘాటు విమర్శలు చేస్తూ ఏవేవో కథలు చెబుతున్నారు. తాజాగా తన తమ్ముడు పవన్ కల్యాణ్ పార్టీ గురించి మాట్లాడుతూ వేరే పార్టీల వారికి వార్నింగ్ ఇస్తూ వీడియో పెట్టారు ఈ వీడియో సోషల్ మెడియ లో వైరల్ అవుతున్నాయి.

ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ ‘గ్లాసే (జనసేన పార్టీ గుర్తు) కదా అని పగలగొట్లాని చూస్తే.. పీక కోస్తది’ అని నాగబాబు హెచ్చరించారు. జనసేనను తొక్కేయాలని, జనసైనికులను మానసికంగా కుంగదీయాలని నీచమైన ఆలోచనలు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ వాళ్లే.. పవన్ వైసీపీతో కలిసిపోయారంటున్నారని.. వైసీపీ వాళ్లేమో.. పవన్, టీడీపీతో పొత్తు పెట్టుకున్నాడని కామెంట్స్ చేస్తున్నారని మధ్యలో బీజేపీతో కూడా కలిసిపోయాడని కామెంట్స్ చేస్తున్నరన్నారు.

కళ్యాణ్ బాబు అంత ఓపెన్ గా చెప్పినా కొంచెం కూడా సెన్స్ లేదా అని ప్రశ్నించారు. పవన్.. మీ లాగా కన్వెన్షనల్,క్రిమినల్, ఫ్యాక్షన్, ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా చేసే వ్యక్తి కాదంటూ టీడీపీ, వైసీపీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఒక జెన్యూన్ ప్రభుత్వాన్ని ప్రజలకు అందించాలని జనంలో నుంచి వస్తున్న వ్యక్తి పవన్ అని కొణియాడారు.

ఎంత తొక్కాలని చూసినా.. పవన్ అంత ఎత్తుకు ఎదుగుతారన్నారు. ఎంత నిజానికి దిగజారినా.. జనం గుండెల్లో ఉన్న జనసేన, పవన్ ని ఏం చేయలేరన్నారు. గాజు గ్లాసు అనేక రకాలుగా ఉపయోగపడుతుందని నాగబాబు అన్నారు. దాహం వేస్తే అందులో నీరు పోసుకొని దాహం తీర్చుకోవచ్చు అని ఆయన అన్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: