శుక్రవారం నాడు శాసనసభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై చర్చలో భాగంగా టీటీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ.. గతంలో ఎన్టీఆర్ తీసుకువచ్చిన పలు సంస్కరణలు రాష్ట్రాభివృద్ధికి ఎంతగానో సహకరించాయని. అలాగే ఇప్పుడు కేసీఆర్ కూడా పలు సంస్కరణలు తీసుకొచ్చారంటూ కేసీఆర్‌ను, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుతో పొలుస్తూ వెంకటవీరయ్య ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం, పరిపాలన సంస్కరణలు, పంటలను కాపాడేందుకు విద్యుత్ రంగంలో తీసుకొచ్చిన మార్పులు అద్భుతంగా ఉన్నాయని వెంకటవీరయ్య పేర్కొన్నారు. ముఖ్యంగా గురుకుల విద్యాలయ వ్యవస్థ విషయంలో కేసీఆర్ మంచి నిర్ణయం తీసుకున్నారని.. దీనితో పాటు అప్పుడు ఎన్టీఆర్ మండలి వ్యవస్థను తీసుకువస్తే.. ఇప్పుడు కేసీఆర్ కొత్త జిల్లాలను తీసుకు వచ్చారని చెప్పారు. అలాగే దళితులకు ప్రత్యేక యూనివర్శిటీ నెలకొల్పాలని కోరారు. ప్రభుత్వ పథకాలు మరింత సమర్థవంతంగా అమలు జరిగేందుకు చర్యలు తీసుకోవాలని… దీనికి తమ సహాయ, సహకారాలు ఉంటాయని సండ్ర చెప్పారు. అదేవిధంగా ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాలను కలిపి సత్తుపల్లి కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని కోరారు.
ఆనాడు ఎన్టీఆర్.. ఈనాడు కేసీఆర్: టీడీపీ ఎమ్మెల్యే..!!
Share.