విజయ్ మాల్యాతో జగన్ భేటీ..?

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సంచలన ఆరోపణలు చేశారు. లండన్ కు వెళ్లిన జగన్ లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాతో రహస్యంగా భేటీ అయ్యారని వెంకన్న ఆరోపించారు. ఎన్నికల కోసం హవాలా డబ్బును భారత్ కు తరలించేందుకే ఈ సమావేశం జరిగిందని విమర్శించారు. ఈ భేటీ వివరాలను జగన్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అమరావతిలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో బుద్ధా వెంకన్న మాట్లాడారు. అలాగే శుక్రవారం నాడు చెన్నైలోని ఓ హోటల్ లో వైసీపీ నేత సుబ్బారెడ్డి తో బీజేపీ నాయకురాలు పురందేశ్వరి, టీఆర్‌ఎస్‌ నేత సంతోష్‌, మోహన్‌బాబు రహస్యంగా భేటీ అయినట్లు ఆరోపించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నిధుల కోసమే ఈ సమావేశం జరిగిందని బద్దా పేర్కొన్నారు. జగన్ లండన్ పర్యటనలో ఎవరెవరిని కలిశారో చెప్పాలన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా టీడీపీ విజయాన్ని అడ్డుకోలేరనీ, ఏపీలో మరోసారి తామే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Share.

Comments are closed.

%d bloggers like this: