మహేశ్ ఇన్ మేడమ్ టుస్సాడ్స్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

మేడమ్ టుస్సాడ్స్ ఈ పేరు వినగానే గుర్తొచ్చేది మైనపు విగ్రహాలు. అచ్చు దిద్దినట్టుగా మనిషిని పోలిన మైనపు విగ్రహాలని తీర్చిదిద్దటంలో మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ప్రపంచ గుర్తింపు పొందింది. జీవితాలలో అంచనాలకి మించిన ఖ్యాతి సంపాదించిన వ్యక్తుల మైనపు విగ్రహాలని వారి మ్యూజియం లో పెట్టడం ఈ సంస్థ ప్రత్యేకత..

అయితే సూపర్ స్టార్ మహేశ్ బాబు మైనపు విగ్రహాన్ని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ప్రతినిధులు రూపొందించిన సంగతి తెలిసిందే. దీన్ని సింగపూర్ లోని మ్యూజియంలో భద్రపరిచారు. తాజాగా ఈ నెల 25న(సోమవారం) ఈ విగ్రహం హైదరాబాద్ లోని ఏఎంబీ సినిమాస్ కు చేరుకోనుంది. అనంతరం ఈ మైనపు బొమ్మను మహేశ్ ఆవిష్కరించనున్నారు.

కాగా, ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని ఏఎంబీ సినిమాస్ యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది. విగ్రహావిష్కరణ అనంతరం ఈ మైనపు బొమ్మను సింగపూర్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంకు తరలించి సందర్శకులకు అందుబాటులో ఉంచనున్నారు. కాగా, మహేశ్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 25న ఈ సినిమాను అభిమానుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాతలు సన్నాహాలు చేసుకుంటున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: