కార్తీ 19.. భారీ అంచనాలు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

తమిళ నటుడు కార్తీ ఎన్నో చిత్రాలను అటు తమిళం లోనే కాకుండా తెలుగు లో కూడా తీయడంతో మనందరికీ సుపరిచితుడయ్యాడు. తమిళంలోనే కాకుండా తెలుగులోను అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. తాజాగా ఈయన నటించిన సినిమా ఖాకీ కి తెలుగు లోనూ భారీ అంచనాలను వసూళ్లను సంపాదించిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రానికి నిర్మాతగా వహించిన ఎస్‌ఆర్ ప్రకాష్ బాబు మరలా కార్తీ తో ఇంకో చిత్రం చేయన్నున్నారు.

ఇప్పటివరకు 18 చిత్రాలు పూర్తి చేసుకున్న కార్తీ ఇప్పుడు 19 వ చిత్రం డ్రీమ్ వారియర్ బ్యానర్ పై ఎస్‌ఆర్ ప్రకాష్ బాబు నిర్మాతగా వహిస్తున్న చిత్రం చేయబోతున్నాడు. దీనికి రేమో సినిమా ఫేమ్ భాగ్యరాజ్ కణ్ణన్ దర్శకత్వం చేయబోతున్నారు. అయితే కథానాయికగా రష్మిక మందన ను ఎంపిక చేశారు. కానీ టైటిల్ ని మాత్రం ఇంకా ఖరారు చేయలేదు. ప్రకాష్ బాబు, కార్తీ ఈ సూపర్ హిట్ కాంబినేషన్ మరో సారి వస్తుండటంతో ప్రేక్షకులకి భారీ అంచనాలు ఉన్నాయి. ఇక సినిమా ఎలా ఉండబోతుందో స్టోరీ లైన్ ఎంటో అనే ప్రశ్నలకి ఇంకా సమాధానం రాలేదు..

Share.

Comments are closed.

%d bloggers like this: