నాని-కార్తికేయ ముల్టీస్టారర్ గ్యాంగ్ లీడర్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రస్థుతం నేచురల్ స్టార్ నాని జెర్సీ చిత్రంతో బిజీగా ఉన్నారు.. ఈ సినిమా దధాపుగా పూర్తయినట్టే విడుదలకి సిద్ధమవుతుంది. ఈ చిత్రం తరువాత నాచురల్ స్టార్ నాని మల్టీస్టారర్ సినిమా తో మన ముందుకు రానున్నారు మరో కథానాయకుడిగా ఆర్‌ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ ని ఎంపిక చేశారు. వెర్సటైల్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్‌ పతాకం పై ఈ సినిమా మన ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, సి.వి.మోహన్‌(సివిఎం) నిర్మాస్తున్నారు.

ప్రొడక్షన్‌ నెం.8 గా నిర్మిస్తున్న ఈ చిత్రానికి గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ ని ఖరారు చేశారు. నాని పుట్టినరోజు సందర్భంగా నిర్మాతలు టైటిల్ ని ప్రకటించారు. రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ లో విడుదల కానుంది. అయితే ఈ సినిమా మల్టీస్టారర్ గా మన ముందుకు రానుంది. ముఖ్య పాత్రల్లో నాచురల్ స్టార్ నాని, కార్తికేయ, ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్‌ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్‌, జైజా, సత్య తదితరులు కనిపించనున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌, సినిమాటోగ్రఫీ: మిరోస్లా కుబా బ్రోజెక్‌, మాటలు: వెంకీ, డార్లింగ్‌ స్వామి, రచనా సహకారం: ముకుంద్ పాండే, పొడక్షన్‌ డిజైనర్‌: రాజీవన్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌: రామ్‌కుమార్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: ఉత్తర మీనన్‌, స్టిల్స్‌: జి.నారాయణరావు, విఎఫ్ఎక్స్‌ సూపర్‌వైజర్‌: సనత్‌(ఫైర్‌ ఫ్లై) కో-డైరెక్టర్‌: కె.సదాశివరావు, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: శేషు, సి.ఇ.ఓ.: చిరంజీవి(చెర్రీ), నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, సి.వి.మోహన్‌(సివిఎం), కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విక్రమ్‌ కె.కుమార్‌.

Share.

Comments are closed.

%d bloggers like this: