డిజాస్టర్ దిశగా.. ఎన్‌టి‌ఆర్ మహానాయకుడు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రముఖ నటుడు, టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయులు నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ లు తీస్తూ ఒకరి పై ఒకరు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఒక్క రామారావు పై దాదాపుగా 4 సినిమాలు తెరకెక్కిస్తున్నారు. అయితే ఇందులో ఇప్పటికే రెండు సినిమాలు బోల్తా పడ్డాయి. డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించిన చిత్రాలు ఎన్‌టి‌ఆర్ కథానాయకుడు దాని సీక్వల్ ఎన్‌టి‌ఆర్ మహానాయకుడు బాక్స్ ఆఫీస్ ముంగిట బోల్తా పడ్డాయి భారీ అంచనాలు సృష్టించిన ఈ సినిమాలలో ఏ ఒక్కటి కూడా నిర్మాతలకి ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ఆశించిన స్థాయిలో విజయం దక్కలేదు దీంతో హీరో బాలకృష్ణ దిరెక్టర్ క్రిష్ ఇద్దరు డిప్రెషన్లో పడ్డట్టు కథనాలు వినిపిస్తున్నాయి.
ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగం ‘మహానాయకుడు’ ఇటీవల విడుదలై డిజాస్టర్ దిశగా పరుగులు తీస్తుంది. రెండో రోజుకే ఈ సినిమా చతికిలపడింది. మొదటివారంలో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసిన డిస్ట్రిబ్యూటర్ షేర్ రూ.3.40 కోట్లు. శని, ఆదివారాల్లో కూడా ఈ సినిమా సత్తా చాటలేకపోయింది.
ఏరియాల వారీగా కలెక్షన్లు..
నైజాం………………………………….. రూ.0.64 కోట్లు
సీడెడ్…………………………………….రూ. 0.28 కోట్లు
ఉత్తరాంధ్ర…………………………….రూ.0.28 కోట్లు
గుంటూరు………………………………రూ.0.62 కోట్లు
ఈస్ట్……………………………………….రూ.0.17 కోట్లు
వెస్ట్………………………………………..రూ.0.18 కోట్లు
కృష్ణ………………………………………..రూ.0.29 కోట్లు
నెల్లూరు……………………………………రూ.0.10 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా………………………రూ.2.56 కోట్లు
ఓవర్సీస్…………………………………….రూ.0.60 కోట్లు
మొత్తం కలిసి ప్రపంచవాప్తంగా ఈ సినిమా వసూలు చేసిన మొత్తం రూ.3.41 కోట్లు

Share.

Comments are closed.

%d bloggers like this: