కొత్త ఛానల్ తో ‘దూకుడు’ నిర్మాత..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర త్వరలో త్వరలో ఓ పూర్తి స్దాయి సినిమా వార్తలు ప్రసారం చేసే టీవీ ఛానెల్ ను లాంచ్ చేస్తునట్టు సమాచారం. ఇది వరకే ఆయన ఒక టి‌వి ఛానల్నీ లంచ్ చేశారు. అదే ఏ టీవీ… గత కొంత కాలంగా ఆయన ఆ ఛానల్ ని పట్టించుకోవడం లేదు. ఇప్పుడు మళ్లీ ఆ టీవి ఛానెల్ ని మరోసారి రీ లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దీనికి గాను ఆయన కొత్త ప్లాన్స్ ని ఆలోచనలని ఆ చానల్ పై పెట్టి మరింత చక్కాగా తీర్చిదిద్దనున్నారు..!

ఎ టీవీ ఛానెల్ ని ప్రత్యేకంగా సినిమా వార్తలు,లేటెస్ట్ అప్ డేట్స్, లైవ్ ఈవెంట్స్, షూటింగ్ అప్డేట్స్, గాసిప్స్, న్యూస్ తో రన్ చేయాలని నిర్ణయించుకున్నారట. తమ సినిమాల పబ్లిసిటీ నిమిత్తం బయిట టీవి ఛానెల్స్ కు చాలా డబ్బు పే చేస్తున్న నేపధ్యంలో ఆయన తమ ఛానెలే ఉంటే తమ సినిమాలకు ఉచిత పబ్లిసిటీ దక్కుతుందనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెపుతున్నారు.
పెద్ద నిర్మాతలంతా తమ సినిమాల లైవ్ కవరేజ్ లు ఎక్సక్లూజివ్ గా ఎటీవికే ఇచ్చేటట్లు మాట్లాడుకుని రంగంలోకి దిగుతున్నాడంటున్నారు. ఇక ఈ ఛానెల్ ఉగాది నుంచి లైవ్ లోకి రానుంది. అలాగే తమ ఛానెల్ లో ప్రసారం చేసేందుకు గాను చాలా సినిమాల రైట్స్ ని అనీల్ సుంకర తీసుకుంటున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: