రాయలసీమ లోని కర్నూల్ జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడు రోజుల పర్యటనలో భాగంగా రెండో రోజు కర్నూల్ నుండి ఆదోని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రోడ్ మార్గం పై వెళ్తూన్నా పవన్ కు దారి పొడవునా జనసేన శ్రేణులు ఆయనకి ఘనస్వాగతం పలుకుతున్నారు.
రాయలసీమ లోని కర్నూల్ జిల్లాలో జనసేనాని పవన్ కళ్యాణ్ మూడు రోజుల పర్యటన నేడు రెండవ రోజుకి చేరుకుంది. పర్యటనలో భాగంగా నేడు ఆయన ఆదోని చేరుకున్నారు. ఈ దిశలో వెళ్తున్న పవన్ కి జనం రోడ్డు పొడువునా ఘనా స్వాగతం పలికారు. కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు లో జనసేన సైనికులు పెద్ద ఎత్తున రోడ్ పై ఉండటం తో పవన్ వాహనం నుండి బయటకు వచ్చి రోడ్ షో నిర్వహించారు. రోడ్ షో లో పెద్ద ఎత్తున అభిమానులు జై జనసేన, జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేస్తూ ముందుకు వెళ్లారు. రోడ్ షోలో భాగంగా పట్టణంలోని శివ సర్కిల్, మీదుగా సోమప్ప సర్కిల్, వైస్సార్ సర్కిల్ మీదుగా రోడ్ షో నిర్వహిస్తూ ఆదోని వెళ్లారు. స్థానిక జనేన నాయకులు తమ ఉనికిని కనభరుచుటకు బలగాలను చూపించుటకు తమ ఫ్లెక్సీ లతో పట్టణం అంతా నింపేశారు. మరో పక్క స్థానికు నాయకులు మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు, బందే నవాజ్ వారి అనుచరులతో ఒక్క సారిగా పట్టణంలోకి తమ బలగాలతో పెద్ద ఎత్తున తరలివచ్చారు.