ప్రముఖ బాక్సర్, మన తెలంగాణ కి చెందిన తెలుగు అమ్మాయి నీఖత్ జరీన్ బల్గేరియా లో జరిగిన పోటీల్లో స్త్రందా బాక్సింగ్ గొల్డ్ మెడల్ గెలిచిన విషయం తెలిసిందే. ఈ సంధర్భంగా నిన్న తెలంగాణ భవన్ లో తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్రీడల మంత్రి శ్రీనివాస్ గౌడ్ ని కలిశారు. తాను గెలిచిన బంగారు పతకాన్ని చూపించి తన గెలుపుకి తెలంగాణ సర్కార్ చేసిన సహాయాన్ని ఆమె కేటీఆర్ తో పంచుకున్నారు.
ఈ సందర్భంగా నిఖత్ జరీన్ పోరాట స్ఫూర్తిని పట్టుదలను అభినందించిన కేటీఆర్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. నిఖత్ జరీన్ తో పాటు వచ్చిన కుటుంబ సభ్యులను వారు ఆమెకి అందిస్తున్న సహకారాన్ని ఆయన అభినందించారు. తెలంగాణ నుంచి బాక్సింగ్ లో అద్బుతమైన ప్రతిభాపాటవాలతో ఆమె యువతకు ఒక ఐకాన్ గా నిలుస్తున్నదని ఆమెను అభినందించారు. భవిష్యత్తులోనూ నిఖత్ జరీన్ కు ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు.
గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వం తనకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ప్రభుత్వ ప్రోత్సాహంతో భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధిస్తానన్న నమ్మకాన్ని ఆమె వ్యక్తం చేశారు. ఇన్ని రోజులుగా తనకు అందిస్తున్న సహకారం పట్ల ఆమె ధన్యవాదాలు తెలియజేశారు.