భారత ఎయిర్ ఫోర్స్ కి నా సెల్యూట్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఈరోజు తెల్లవారుజామున 3.30 ప్రాంతంలో భారత యుద్ధ విమానాలు పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాయి. నియంత్రణ రేఖ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాక్ భూభాగంలోని బాలాకోట్ ఉగ్రవాద శిక్షణ శిబిరంపై తెల్లవారి 3.45 గంటలు, పీఓకేలోని ముజఫర్‌బాద్‌లోని శిబిరంపై 3.48, చికోటీలో 3.58 గంటలకు మిరాజ్ 2000 రకానికి చెందిన 12 యుద్ధ విమానాలతో దాడిచేసినట్టు ఇండియన్ ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఈ దాడి లో 300 మంది ఉగ్రవాదులు మరణించినట్టు సమాచారం.

భారత ఏయిర్ ఫోర్స్ జరిపిన ఈ దాడికి దేశ వ్యాప్తంగా అందరూ హర్షాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రతీకార వాంఛ తో రగులుతున్న భారతీయులకు ఇదో చక్కటి వార్తా అని భావిస్తున్నారు. అయితే తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాజీ అయిర్ ఫోర్స్ పైలట్ అని తెలిసిన విషయమే. నేడు భారత ఏయిర్ ఫోర్స్ జరిపిన దాడికి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ తన ట్వీటర్ ఖాతా ద్వారా ట్వీట్ చేశారు.. ట్వీట్లో ఆయన మాట్లాడుతూ ‘ఈరోజు జరిపిన దాడికి గాను భారత ఎయిర్ ఫోర్స్ కి నా సెల్యూట్. ఇదే స్పూర్తి తో ఇదే దైర్యంతో బహవల్పూర్ సమీపంలోని జేష్ ఏ మహమ్మద్ తీవ్రవాద క్యాంప్ లపై కూడా దాడి జరిపి బార్డర్ దాటి చొరపడ్డ ఉగ్రవాదులకి గట్టి హెచ్చరికలు జారీ చేయవలసిందిగా ఆయన కోరారు.

Share.

Comments are closed.

%d bloggers like this: