అభ్యర్థుల ఎంపిక పై సీఎం స్పెషల్ ఫోకస్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్నాయి ప్రతీ పార్టీ వారు వార్వారి వ్యూహాలతో ఎన్నికల కార్యాచరణ లో బిజీగా ఉన్నారు. ఎన్నికల రేస్ లో నువ్వు ముందా అంటే నేను ముందు అన్నట్టుగా పరుగులు తీస్తున్నారు. ఎవ్వరూ కొంచం కూడా విశ్రాంతి తీసుకోవడం లేదు. కొత్త వ్యూహాలు కొత్త ప్లాన్ లతో ఎక్కడా జాప్యం చేయకుండా ముందుకు సాగుతున్నారు. ఈ నేపద్యంలో ఏపిన సీఎం చంద్రబాబు ఎన్నికల పై మరింత శ్రద్ధతో కాన్సెంట్రేట్ చేస్తున్నాడు. దీనికి గాను ప్రతీ రోజు ఒక్కో నియోజకవర్గం పై సమీక్షలు నిర్వహించి కసరత్తులు చేయనున్నారు.

ఇవాళ్టి నుంచి రోజుకు రెండు పార్లమెంట్ స్థానాలపై సీఎం సమీక్ష చేయబోతున్నాడు. రోజుకు 14 అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల ఎంపిక పై కసరత్తు చేయనున్నాడు. ఒక్కో అసెంబ్లీ స్థానం నుంచి అమరావతికి రానున్న 60 మంది క్రియాశీలక నాయకులు అభ్యర్థుల ఎంపికలో ఇకపై నియోజకవర్గ పరిశీలకులకు ప్రాధాన్యత ఇవ్వనున్నాడు.

ముందుగా నియోజకవర్గాలవారీగా పార్టీ నేతలతో చర్చలు జరపనున్న పరిశీలకులు ఆపై నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి,అభ్యర్థుల గురించి సీఎంకు వివరిస్తారు…చివరిలో దశ చర్చల జరిపిన తరువాత అభ్యర్ది ని ఎంపిక చేయనున్న సీఎం..

ఇవాళ ఏలూరు,నర్సాపురం పార్లమెంట్ స్థానాలపై సీఎం రివ్యూ

నర్సాపురం పరిధిలో పాలకొల్లు,నర్సాపురం,ఆచంట,ఉండి, తణుకు అసెంబ్లీ స్థానాలకు సిట్టింగులకే అవకాశం ఉండొచ్చని సమాచారం…భీమవరం,తాడేపల్లిగూడెం స్థానాలకు కొత్త అభ్యర్థుల ప్రకటన చేసే సూచనలు.. ఏలూరు పార్లమెంట్ పరిధిలో దెందులూరు, ఏలూరు, ఉంగుటూరు స్థానాలు సిట్టింగులకే ఇచ్చే ఆలోచనలో అధిష్టానం ఉంది ..పోలవరం, చింతలపూడి, నూజివీడు, కైకలూరు స్థానాలకు అభ్యర్థులను మార్చే ఛాన్స్ ఉండొచ్చు…

Share.

Comments are closed.

%d bloggers like this: