ఫ్యాన్ ఆంధ్రలో..! స్విచ్ హైదరాబాద్ లో..! ఫీజులు ఢిల్లీలో..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఎలక్షన్ మిషన్ 2019 పై ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలికాన్ఫరెన్స్ ప్రజాప్రతినిధులు, బూత్ కన్వీనర్లు, పార్టీ బాధ్యులు పాల్గొన్నారు. టెలికాన్ఫరెన్స్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్క్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రం సాధించిన ఘనతలనీ గుర్తు చేశాడు. వై‌ఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా విఫలమయ్యడని అందుకే ఆ భాద్యతని కేసీఆర్ తీసుకున్నాడని వారి పై కామెంట్స్ చేశాడు. ప్రధాని మోది చేస్తున్న అన్యాయాల్ని గుర్తు చేస్తూ ఆయన పై తీవ్రంగా విరుచుకపడ్డారు. ఆయనే మళ్ళీ ప్రధాని అవుతే జరిగే నష్టం గురించి తెలియజేశారు.

చంద్రబాబు మాట్లాడుతూ.. ‘ గత నాలుగున్నర ఏళ్ల కాలంలో రాష్ట్రానికి మొత్తం 700అవార్డులు వచ్చాయి.. మన పనితీరుకు, సాధించిన ప్రగతికి అవార్డులే గీటురాళ్లు.. ఇక్కడ బిజెపి నేతలు మన పై విమర్శలు చేస్తున్నారు, ఢిల్లీ బిజెపి మంత్రులు మాత్రం మనకి అవార్డులు ఇస్తున్నారు.. నిన్న 7అవార్డులు మన జలవనరులకు, 7అవార్డులు వైద్యశాఖకు ఇచ్చారు.. మోదిని మించిన నటుడు లేడు. పేదల సేవలో లీస్ట్ , కానీ నటనలో మోది ఫస్ట్..

ఈసారి ఎన్నికల్లో మళ్లీ మోది వస్తే దేశం మరో 50ఏళ్లు వెనక్కి పోతుంది. ఈ 5ఏళ్ల మోది పాలనలోనే 50ఏళ్లు వెనక్కిపోయాం.. మోది రాకూడదని దేశం మొత్తం ఘోషిస్తోంది.. ఏపిలో వైసిపి తరఫున టిఆర్ఎస్ వకాల్తా తీసుకుంది.. ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి విఫలం అయ్యారు.. అందుకే ఆ బాధ్యతను టిఆర్ఎస్ తీసుకుంది.. ఫ్యాన్ ఆంధ్రలో-స్విచ్ హైదరాబాద్ లో-ఫీజులు ఢిల్లీలో అన్నట్టుగా రాజకీయం మారింది.. ఒక్క ముక్కలో 3పార్టీల కుట్రలను కార్యకర్తలకు చెప్పాడు..

దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లి 3పార్టీల లాలూచి ఎండగట్టాలి.. ఫ్రస్టేషన్ తోనే వైసిపి అరాచకాలు సృష్టిస్తోంది.. ఎర్రచందనం ఆదాయం పోయేసరికి వైసిపిలో ఫ్రస్టేషన్ మొదలయ్యింది.. వైసిపి నేతలు రౌడీ రాజకీయాలు చేస్తున్నారు.. ఊరికొక రౌడీని వదులుతున్నారు.. వైసిపి రౌడీయిజానికి ప్రజలు భయపడరు.. ఓట్లతోనే వైసిపి రౌడీలకు తగిన గుణపాఠం చెబుతారు.. చంద్రగిరిలో రౌడీయిజంపై ప్రజలే తిరగబడ్డారు..

ప్రజల్లో చైతన్యం రావాలి. వైసిపి రౌడీయిజాన్ని తిప్పికొట్టాలి.. ఏపిని మరో బీహార్ గా చేయాలని జగన్ కుట్రలు.. రౌడీల రాజ్యం చేయాలని కుతంత్రాలు పన్నుతున్నాడు.. టిడిపి అధికారంలో ఉంటేనే రౌడియిజంపై ఉక్కుపాదం పడుతుంది.. వైసిపి వస్తే గల్లీగల్లీకి రౌడీలు తయారవుతారు.. మహిళలకు, చిన్నారులకు భద్రత ఉండదు.. వ్యాపారులను వ్యాపారం చేసుకోనివ్వరు.. చిత్తూరు,ఒంగోలు,దెందులూరు,కొండవీడు సంఘటనలే రుజువు.. రాష్ట్రంలో ఉద్రిక్తతలు పెంచేందుకు వైసిపి కుట్రలు.. గతంలో హైదరాబాద్ లో మతకలహాలు సృష్టించింది వీళ్లే.. ఇప్పుడు 13జిల్లాలలో కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు.. మళ్లీ ఆంధ్రప్రదేశ్ లో అరాచకం సృష్టించాలని చూస్తున్నారు..అభివృధ్ది కోసం తెలుగుదేశం పార్టీ ఆరాటం.. అరాచకాలు సృష్టించడమే వైసిపి కి అలవాటు అని ఆయన కార్యకర్తలతో అన్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: