91వ ఆస్కార్ పురస్కారాలు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఎవ్వరూ ఊహించని రీతిలో 91వ ఆస్కార్‌ అకాడమీ అవార్డులు గడిచాయి. ఓ చిత్రానికి ఒక విభాగంలో ఆస్కార్‌ వస్తే గొప్ప. కానీ ఒకే చిత్రానికి ఒకటికి మించి వస్తే విశేషమే. అలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఒకే చిత్రానికి నాలుగు విభాగాల్లోనూ, మూడు చిత్రాలకు మూడేసి విభాగాల్లో ఆస్కార్‌ అవార్డులు వరించాయి.

బొహెమియన్‌ రాస్పోడీ…

ఈ చిత్రంలో నటించిన రమి మాలేక్‌కు ఉత్తమ నటుడు పురస్కారం వరించింది. బెస్ట్‌ సౌండ్‌ మిక్సింగ్‌, బెస్ట్‌ ఎడిటింగ్‌, బెస్ట్‌ సౌండ్‌ ఎడిటింగ్‌ విభాగాల్లో ఆస్కార్లు వరించాయి. ఇలా అత్యధికంగా ఆస్కార్‌ అవార్డులు దక్కించుకున్న చిత్రంగా ఈ ఏడాది ఈ సినిమా నిలిచింది. బ్రిటీష్‌ రాక్‌ బ్రాండ్‌ క్వీన్‌ సింగర్స్‌ ప్రెడ్డీ మెర్క్యూరీ జీవిత కథ ఆధారంగా రూపొందింది.

గ్రీన్‌ బుక్‌…

91వ ఆస్కార్‌ అకాడమీ ఉత్తమ చిత్రం విభాగానికి ‘గ్రీన్‌ బుక్‌’ను ఎంపిక చేసి ఆశ్చర్య పరిచింది. ఆ విభాగంలో పోటీ పడ్డ చిత్రాలు బృందాలన్నీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో ‘గ్రీన్‌ బుక్‌’ను బెస్ట్‌ చిత్రంగా ప్రకటించినా అక్కడి వారంతా నమ్మకపోవడం విశేషం. అంతేకాదు సోషల్‌ మీడియాలో కూడా అకాడమీ పొరపడిందన్న సందేహాన్ని వ్యక్తం చేశారు కొందరు స్టార్స్‌. ఈ చిత్రానికి ఉత్తమ చిత్రం, ఉత్తమ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే, ఉత్తమ సహాయ నటుడు విభాగాల్లో అవార్డులను వచ్చాయి. ఈ చిత్రానికి పెటెర్‌ పారెల్లీ దర్శకత్వం వహించారు. బయోగ్రాఫికల్‌ కామెడీ డ్రామా తెరకెక్కించారు. పియోనిస్టు డాన్‌ షిల్లీయో, అతని డ్రైవర్‌ వల్లెలొంగ జీవిత కథ ఆధారంగా రూపొందించారు. ఈ సినిమాకు వల్లెలొంగ కొడుకు నిక్‌ వల్లెలొంగ కథను అందించడం విశేషం. వల్లెలొంగ తన అమ్మకు రాసిన ఉత్తరాలు, అతను ఇచ్చిన ఇంటర్వ్యూలు ఆధారంగా తెరకెక్కించారు. ఇప్పటికే ఈచిత్రం టొరొంటో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రీమియర్‌ షో ప్రదర్శించారు. ప్రీపుల్స్‌ ఛాయిస్‌ అవార్డు, ఇప్పుడు ఆస్కార్‌ దక్కించుకుంది.

బ్లాక్‌ పాంథర్‌…

‘బ్లాక్‌ పాంథర్‌’ అమెరికన్‌ సూపర్‌హీరో చిత్రమిది. గత ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఉత్తమ కాస్ట్యూమ్‌, ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌ విభాగాల్లో రుత్‌ కార్టర్‌, హన్నా బీచ్లర్‌ అనే ఇద్దరు మహిళలు అవార్డులు అందుకున్నారు. మార్వెల్‌ కామిక్స్‌ ఆధారంగానే కథ రాసుకున్నారు. సినిమాలో కూడా ఇదే పేరును పాత్రకు ఉంచేశారు.

రోమా…

‘బ్లాక్‌ పాంథర్‌’ తర్వాత ఎక్కువ విభాగాల్లో అవార్డులు అందుకున్న చిత్రం ‘రోమా’. ఇది సెమీ-ఆటోబయోగ్రాఫికల్‌ చిత్రం. అంటే దర్శకుడు ఆల్ఫోన్సో కారోన్‌ తన సినిమాను తానే తెరకెక్కించుకున్నారన్నమాట. విశేషం. మెక్సికో రాజధాని మెక్సికో సిటీలో కారోన్‌ బాల్యం ఎలా గడిచింది? తదితర విషయాలను ఈ చిత్రంలో చూపించారు. 75వ వెనిస్‌ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్‌లో ఈ సినిమాకు గోల్డెన్‌ లయన్‌ అవార్డు లభించింది. 2018లో ఈ సినిమా విడుదలైనప్పుడు తక్కువ థియేటర్లలో ప్రదర్శితమైంది. ఆ తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం చేయడంతో సినిమాకు థియేటర్ల సంఖ్య పెరిగింది. ఉత్తమ విదేశీ చిత్రంగా ‘రోమా’కు అవార్డు దక్కింది. ఈ అవార్డు అందుకున్న తొలి మెక్సికన్‌ చిత్రమిదే కావడం విశేషం. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైన్‌, ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగాల్లో అవార్డులు అందుకుందీ చిత్రం.

Share.

Comments are closed.

%d bloggers like this: