సర్జికల్ స్ట్రైక్ పై సెలబ్రిటీలంతా..! ఇలా..!

Google+ Pinterest LinkedIn Tumblr +

మంగళవారం తెల్లవారు జామున 3.38 గంటల ప్రాంతానికి భారత వైమానికి దళం పది యుద్ధ విమానాలతో పాకిస్తాన్ లోపలికి చొరబడి ఉగ్ర శిక్షణ శిబిరాలపై దాడి చేసింది. దాదాపుగా వేయి కిలోల ఆర్‌డి‌ఎక్స్ కలిగిన బాంబులని పాకిస్తాన్ శిబిరాలపై వేసింది.. ఈ దాడిలో దాదాపుగా 300 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు మరణించి ఉండొచ్చని భారత ఆర్మీ భావిస్తుంది.

ఈ దాడుల్లో జైషే మహ్మద్ కి చెందిన పలువురు అగ్రనేతలు కూడా చనిపోయి ఉంటారని అనుకుంటున్నారు. ఈ క్రమంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ని పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు భారతీయులు. సినిమా సెలబ్రిటీలు సైతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. సోషల్ మీడియాలో సర్జికల్ స్ట్రైక్ 2 అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.

సేలబ్రిటీలు రాజకీయ నాయకులు అందరూ ట్విట్టర్ ని వేధిక చేసుకొని వార్వారి స్పందనలను అభినందలను తెలియజేస్తున్నారు భారత ఆర్మీని ఎయిర్ ఫోర్స్ ని పొగడ్తలతో కొనియాడుతున్నారు.

సూపర్ స్టార్ రజినీకాంత్ బ్రావో ఇండియా అంటూ ట్వీట్ చేయగా.. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన స్టైల్ లో ‘ఏయ్ పాకిస్తాన్, నువ్వు ఒకటి కొడితే మేం నాలుగు కొడతాం’ అంటూ ట్వీట్ చేశాడు.

వర్మ శిష్యుడు పూరి కూడా తనదైన స్టైల్ లో ‘బుల్లెట్టు దిగిందా లేదా..?’ అనే డైలాగ్ ని పోస్ట్ చేస్తూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి వందనం చేశాడు.

Share.

Comments are closed.

%d bloggers like this: